
మెల్బోర్న్ వేదికగా గత వారం టీం ఇండియా ఆడిన 4వ టెస్ట్ ను ఏకంగా 184 పరుగులతో ఓడి, ఘోర అవమానాన్ని ఎదురుకున్నారు. మ్యాచ్ ను సులువుగా డ్రాగా ముగించే ఆస్కారం ఉన్నప్పటికీ కూడా చివరి ఒక్క సెషన్ లో ఏకంగా 7 వికెట్లను సమర్పించుకుని ఓటమి పాలయ్యారు. అయితే అప్పటి నుండి క్రిటిక్స్ అన్నీ భారత సీనియర్ ఆటగాళ్ల మీదే.
రేపు సిడ్నీ వేదికగా 5వ మ్యాచ్ ఆడనున్నారు ఇరు జట్లు. టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరు లో నిలిచేందుకు భారత్ గెలుపు అనివార్యం. ఇటు పక్క ఆస్ట్రేలియా జట్టు నేరుగా ఫైనల్ ను చేరేందుకు ఈ మ్యాచ్ గెలుపు దారినిస్తుంది. మరోపక్క, భారత్ గడిచిన 10 ఏళ్ల నుండి బీ.జీ.టీ ను కైవసం చేసుకుంటూ వస్తున్నారు.
మరి ఈ మ్యాచ్ లో ఓటమి పాలైన, లేదా మ్యాచ్ డ్రాగా ముగిసినా, భారత్ ఈసారి బీ.జీ.టీ ను చేజార్చుకున్నట్టే. కనుక, ఈ మ్యాచ్ లో గెలుపు భారత్ కు అన్ని విధాలా చాలా చాల అవసరం. ఇదంతా ఒక చర్చ అయితే, గత రెండు రోజుల నుండి ప్రస్తుత భారత సారధి ‘రోహిత్ శర్మ’ ఈ 5వ టెస్ట్ నుండి తప్పుకొనున్నాడు అనే పుకారు విస్తృతంగా ప్రచారమవుతుంది.
శుబ్మాన్ గిల్ ఇప్పటికే టీం లోకి ఎంట్రీ ఇచ్చేసాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అందుకు బదులుగా నేడు కోచ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు మరికాస్త సంధిగ్ధాన్ని పెంచాయి. రేపు జట్టులో రోహిత్ ఉంటారా అని అడిగిన విలేఖరికు గంభీర్: ‘రేపు పిచ్ బట్టీ టీం ను నిర్ణయిస్తాం!’ అని బదులిచారు. ఆ వాఖ్యలు ఈ చర్చను మరింత వేడెక్కిస్తున్నాయి.
ఏది కాదనుకున్నా, టీం లోని సీనియర్ ఆటగాళ్లు ‘విరాట్ మరియు రోహిత్’ తమ బ్యాట్ తో ఆకట్టుకుంటే టీం మొత్తం మరలా పునర్వైభవాన్ని చూస్తుందనడంలో సంకోచమే లేదు. వచ్చే 5వ టెస్ట్ లో ఈ ఇరువురు సీనియర్స్ తమ బ్యాట్ లకు పని పెడితే, టీం కు కొండంత అండగా నిలుస్తారు లేదంటే టీం కు పెను భారం అనే విమర్శలను ఎదుర్కుంటారు.
ఇప్పటికే ‘ఆకాష్ దీప్’ 5వ టెస్ట్ నుండి నిష్క్రమించబడ్డాడని ఆఫీషియల్ గా ప్రకటించగా, ఆ ప్లేస్ లోకి ఎవరొస్తారనేది చర్చనీయాంశమయింది. ఇటు చూసుకుంటే, గత 46 ఏళ్లగా భారత్ కు సిడ్నీలో టెస్ట్ ను గెలిచిన దాకలాలే లేవు, మరి ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి జట్టులోని సీనియర్ ఆటగాళ్లు తమ ఫామ్ ను అందుకుని, జట్టుకు ఎంతో ముఖ్యమైన ఈ విజయాన్ని అంధించగలరా..?
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…