కడిగిన ఆణిముత్యం బయటకు వస్తున్నారటగా?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ప్రధాన నిందితులు ఒకరొకరుకరుగా తీహార్ జైలు నుంచి విముక్తి పొందుతున్నారు. అప్రూవర్లుగా మారినవారందరూ ముందుగా బయటకు వచ్చేశారు. తర్వాత నిందితులుగా ఉన్న ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌, మాజీ డెప్యూటీ సిఎం మనీష్ సిసోడియాలు బయటకు వచ్చేశారు. కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత ఒక్కరే ఇంకా లోపల ఉండిపోయారు.

ఆమె కూడా సోమవారం బెయిల్‌పై బయటకు వచ్చేస్తారని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అయినా ఛార్జ్ షీట్‌ దాఖలు చేసిన తర్వాత ఇంకా జైల్లో ఉండాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కూడా కేసు తేలేవరకు నిందితులను జైల్లో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది. కనుక కల్వకుంట్ల కవితకి జైలు నుంచి విముక్తి లభించడం ఖాయంగానే కనిపిస్తోంది.

ADVERTISEMENT

ఆమె విడుదల కోసం కేసీఆర్‌ నలుగురు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులను బీజేపీకి అప్పగించబోతున్నట్లు సమాచారం. దానిపై చర్చ మొదలుపెడిత అది మరో పెద్ద కధ అవుతుంది.

కనుక ఆమె జైలు నుంచి బయటకు రావడం వరకే ఈ చర్చని పరిమితం చేసి చూస్తే, బిఆర్ఎస్‌-బీజేపీల మద్య జరిగే ఈ ఇచ్చిపుచ్చుకోవడాల వలన ఆమెపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన లిక్కర్ స్కామ్‌ కేసులకు బ్రేక్ పడుతుంది. రెండు దర్యాప్తు సంస్థలు ఆ ఫైల్స్ అన్నీ మూటకట్టి భద్రంగా అటక మీద పెట్టేయవచ్చు.

అదే జరిగితే కల్వకుంట్ల కవితపై ఎటువంటి కేసు, విచారణ, ఒత్తిడి లేకుండా బయటకు వస్తారు. కనుక ఆమె ముందే చెప్పిన్నట్లు జైలు నుంచి ‘కడిగిన ఆణిముత్యంలా’ బయటకు వస్తారన్న మాట!

ఆమె ఆణిముత్యంలా బయటకు వస్తే దానికి ఏవిదంగా హైప్ సృష్టించాలో కేసీఆర్‌కి బాగా తెలుసు. తెలంగాణ బిడ్డ, పోరాట యోధురాలు కల్వకుంట్ల కవితకు హైదరాబాద్‌లో ఘనంగా స్వాగతం పలికింపజేసి, చివరికి న్యాయం ధర్మమే గెలిచిందని చెప్పుకోవచ్చు.

అలా చెప్పుకున్నా బీజేపీకి పెద్దగా అభ్యంతరం ఉండబోదు కనుక ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి కేంద్రం, మోడీ నిరంకుశ వైఖరి గురించి మరో నాలుగు ముక్కలు అదనంగా మాట్లాడినా మాట్లాడవచ్చు.

ఆ తర్వాత ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా పూర్తయితే అసలు కధ తర్వాత మొదలవుతుంది. అదో పెద్ద కధ. దాని గురించి వేరే చెప్పుకుందాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Hanuman Ansh Telugu Flops: What Went So Horribly Wrong?

Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…

47 minutes ago

విజయ్‌ మొహం ఎప్పుడూ ఇంతేనా? కాస్త నటించొచ్చుగా?

ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…

55 minutes ago