
వైసీపీ కుల రాజకీయాలకు కాపు సామాజికవర్గమే కేంద్ర బిందువు కానుందా.? అందులో భాగంగానే జగన్ తన పార్టీకి ‘కాపు కవచం’ కోసం నాడు ముద్రగడను తెరమీదకు తెచ్చారా.? నేడు అంబటి అరెస్టు ను రాజకీయంగా వాడుకుంటున్నారా.?
ఇక రానున్న కాలంలో రెడ్డి గా మారిన ముద్రగడ ప్రచారాలు కానీ, ముఖ్యమంత్రి పై బూతులతో రెచ్చిపోయిన అంబటి అరెస్టులు కానీ వైసీపీ ని ఎంతవరకు రాజకీయంగా కాపు కాస్తాయి అనే అపనమ్మకంతో వైసీపీ వంగవీటిని తిరిగి పార్టీలోకి ఆహ్వానించబోతుందా.?
ఇందుకోసం వైసీపీ తెరవెనుక రాజకీయం మొదలుపెట్టిందా.? అందుకు వంగవీటి కూడా సూచన ప్రాయంగా అంగీకారం తెలిపారా.? గతంలో వంగవీటి రంగా కుమార్తె ఆశ ప్రకటనలు కూడా వాటికీ సంకేతాలేనా.? వైసీపీ ఎమ్మెల్యే లు జక్కంపూడి గణేష్, దాడిశెట్టి రాజాలను ఉద్దేశించి వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు అందులో భాగమేనా.?
వంగవీటి అనేది విజయవాడ రాజకీయాలలో ఒక బ్రాండ్ మార్క్ ను సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ బ్రాండ్ వాల్యూ ని రాధా తన అయోమయంతో అవమానపరుస్తున్నారా.? కొన్నాళ్ళు కాంగ్రెస్, మరికొన్నాళ్లు ప్రజారాజ్యం అంటూ ఇంకొన్నాళ్ళు వైసీపీ అని లేదు లేదు టీడీపీ అంటూ,
గత ఎన్నికల ముందు జనసేన అని చివరికి టీడీపీ అంటూ ఇప్పుడు తిరిగి మళ్ళీ వైసీపీ నేతలకు మద్దతిస్తూ ఇలా వంగవీటి రాధా రాజకీయంగా మొత్తం ఒక గమ్యం లేని ప్రయాణం మాదిరి తయారయ్యింది. 2024 ఎన్నికల ఫలితాల తరువాత యాక్టీవ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న రాధా తాజాగా తన తండ్రి రంగా విగ్రహావిష్కరణలో వైసీపీ ఎమ్మెల్యే లతో కలిసి స్టేజ్ షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా రాధా చేసిన కొన్ని వ్యాక్యలు వంగవీటి అభిమానులను కూడా అయోమయంలో పడేస్తున్నాయి. మీ ఆశీర్వాదాలే వారికి బలం, ఆ బలం మీరిస్తే రేపటి రోజున మీ కోసం ఈ దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్ నిలబడతారు అంటూ రాధా చేసిన ఈ వ్యాక్యలు ఇప్పుడు వైసీపీ, టీడీపీ లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
వంగవీటి – దేవినేని ఉప్పు నిప్పు మాదిరి ఒకదగ్గర ఉండలేని వారసత్వ పోరులు. అటువంటిది వైసీపీ లో కీలక నేతగా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న దేవినేని అవినాష్ ఉన్న వైసీపీలోకి వంగవీటి రాధా ఎంట్రీ ఉంటుందా.? అది సాధ్యమేనా.? అందుకు వంగవీటి అభిమానులు అంగీకరిస్తారా.? అటువంటి వారి చేరిక వైసీపీకి కాపు ఓటింగ్ ని చేరువ చేస్తుందా.?
ముద్రగడ రాజకీయంతో వైసీపీ కి దక్కని కాపు ఓటింగ్ వంగవీటి రాధా ఎంట్రీతో వైసీపీ కి చేరువవుతుందా.? వైసీపీ కి ఇప్పటికే అంబటి రూపంలో ఒక కాపు టైగెర్ ఉన్నప్పుడు ఇప్పుడు వైసీపీ కి రాధా అవసరం ఉందా.?
The stage is being set for the upcoming local body election in Andhra Pradesh as…
Bollywood's biggest film Ramayana could face a massive setback in the US market, with its…