Telugu

వైసీపీలోకి వలసలు… ఉంటాయా?

వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓ లైన్ ఇస్తే పార్టీలో అందరూ కోరస్ పాడుతున్నారు. రాజకీయాలలో ఇది సహజమే. ఇదివరకు వైసీపీలో సీనియర్లు తప్ప భజన బృందంలో చాలా మంది 175/175 పాటకి కూడా కోరస్ పాడారు. ఎవరి లిరిక్స్ వారివే. ఎవరి పాట వారిష్టం. కనుక ఎవరికీ నచ్చిన మ్యూజిక్ వారు వాయించుకోవచ్చు. కనుక ‘మళ్ళీ మనమే… రప్పా రప్పా’ అని వైసీపీ శ్రేణులు కోరస్ పాడుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ, “పార్టీతో పేరు ప్రతిష్టలు, డబ్బు అన్నీ సంపాదించుకొని, ఎన్నికలలో పార్టీ ఓడిపోగానే బయటకు వెళ్ళిపోయారు. అలాంటివారిని తిరిగి పార్టీలోకి రానిచ్చే ప్రసక్తే లేదు. ఎవరు ఏ కారణం చేత వైసీపీ గూటికి తిరిగి రావాలనుకున్నా అలాంటి వారిని చెప్పుతో కొడతాము,” అని హెచ్చరించారు.

ADVERTISEMENT

అయితే కేతిరెడ్డి చెప్పుతో కొట్టేందుకు వైసీపీలోకి వలసలు ఉంటాయా? ఉండవా? చూద్దాం… ఎన్నికలలో గెలుపోటములు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ముందుగా కూటమి ప్రభుత్వానికి సానుకూలతలు: కూటమి పార్టీల మద్య ఐఖ్యత, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు. భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు. చకచకా సాగుతున్న అమరావతి, పోలవరం నిర్మాణ పనులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలు.

వైసీపీకి సానుకూలతలు, వ్యతిరేకతలు: జగన్‌కు పొరుగు రాష్ట్రంలో కేసీఆర్‌ అండదండలు లభిస్తాయి. వైసీపీకి జగనే ప్రధాన బలం. బలహీనత కూడా. పార్టీలో కొందరు ముఖ్యనేతలు సొంత బలంతో గెలవగలరు. కుల చిచ్చు రగిలించడంలో వైసీపీ సఫలం అయితే లబ్ది పొందవచ్చు.

వ్యతిరేకతలు: కూటమి ప్లస్ పాయింట్స్ అన్నీ వైసీపీకి మైనస్ పాయింట్స్. జగన్‌ శాసనసభకు, ప్రజల మధ్యకు రాకుండా మూడు ప్యాలస్‌ల మద్య తిరుగుతూ కాలక్షేపం చేస్తుండటం. బయటకు వస్తే రప్పారప్పా ప్రజలను భయపెడు తుండటం. ప్రజా సమస్యల కోసం ప్రభుత్వంతో పోరాడటం కంటే కుల,మత రాజకీయాలకే ప్రాధాన్యమిస్తుండటం. ఈ

అంశాలన్నిటినీ వాస్తవిక దృక్పదంతో చూసినప్పుడు వచ్చే ఎన్నికలలో కూడా కూటమి గెలిచి అధికారంలోకి రావడం ఖాయమనే అర్ధమవుతుంది. కనుక కూటమి నుంచి ఓడిపోబోయే వైసీపీలోకి వలసలు ఉంటాయా? అంటే ఉండవనే అర్ధమవుతోంది.

కానీ కేతిరెడ్డి అప్పుడే ఎందుకు చెప్పు తీస్తున్నారు? అంటే కూటమిలో మూడు పార్టీలు సీట్లు సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. కనుక టికెట్లు లభించనివారు చివరి ప్రయత్నంగా వైసీపీలోకి వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. అలాంటివారు ఎవరో ఆయనకు తెలుసు కనుక.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Salman’s Maatrubhumi: Peace Message or BO Trouble?

Salman Khan’s Maatrubhumi might arrive in theatres now that the major issues have been resolved.…

33 minutes ago

Suriya’s Scene: A Big Risk for Naslen’s Debut?

Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, actor Suriya…

1 hour ago