
మునుపెన్నడూ లేని విధంగా ఏపీ రాజకీయాలలో మహిళా నేతల ప్రాముఖ్యత పెరుగుతూ పోతుంది. వైస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ రాజకీయాలలోకి మహిళా నేతల రాజకీయ బలం పెరిగింది. వైస్సార్ మరణాంతరం వైస్సార్ పార్టీ పెట్టిన జగన్ అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లడం ఆ పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని జగన్ చెల్లి, తల్లి రాష్ట్ర వ్యాప్త యాత్రలు చేసి, వైస్సార్ పార్టీ తరుపున ప్రచారాలు చేసి, ఆ పార్టీని ఈస్థాయిలో నిలబెట్టగలిగారు.
వైస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ రాజకీయ వేదికల మీద కనిపించని ఈ ఇద్దరు మహిళా నేతలు షర్మిల, విజయలక్ష్మి జగన్ రాజకీయ ఎదుగుదల కోసం రాజకీయాలలోకి అడుగుపెట్టారు. వీరిని ఏపీ రాజకీయాలకు పరిచయం చేసిన ఘనత వైస్ జగన్ కే దక్కుతుంది. అలాగే అత్యంత కిరాతకంగా చంపబడ్డ తన తండ్రి చావుకి న్యాయం కావాలి అంటూ బయటకొచ్చిన సునీత కు తగిన న్యాయం చేయకుండా దోషులను కాపుకాస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ అంటూ జగన్ పై తిరుగుబాటుకు సిద్దమయ్యారు సునీత.
తన తండ్రి చావుకి న్యాయం జరగాలంటే రాజకీయ ఎదుగుదలే సరైన చర్యగా భావించి ఏపీ రాజకీయాలలోకి అరంగేట్రం చేయడానికి వివేకా కుమార్తె సునీత రెడ్డి ప్రయత్నాలు షురూ చేసారు. సునీత రాజకీయ ఎంట్రీ కి కూడా ఒకరకంగా జగనే కారణం. అలాగే ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న చంద్రబాబుని అడ్డు తొలగించుకోవడానికి బాబు ని అరెస్టు చేసి జైలుకి పంపి ఆయన భార్య నారా భువనేశ్వరిని రాజకీయాలలోకి తీసుకువచ్చారు జగన్.
పార్టీ పెద్దదిక్కు అందుబాటులో లేకపోవడంతో పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు నేనున్నాను అంటూ ముందుకొచ్చారు నారా భువనేశ్వరి. 40 ఏళ్ళ బాబు రాజకీయ జీవితంలో ఎన్నడూ రాజకీయాల వైపు కన్నెత్తి చూడని భువనేశ్వరి జగన్ నిర్ణయంతో రాజకీయాలలోకి అడుగుపెట్టారు. భువనేశ్వరి రాజకీయ అడుగులో కూడా జగనే కీలక పాత్ర పోషించారు.
అలాగే నేను ఈడ పిల్ల కాదు ఆడ పిల్ల అంటూ తెలంగాణ రాజకీయాలకు వెళ్లిపోయిన షర్మిలతో కుటుంబ కలహాలో,ఆస్తి తగాదాలో, పదవుల మీద ఆశో..కారణం ఏదైనా కావొచ్చు జగన్ ను రాజకీయంగా ఎదుర్కోవడానికి “అత్తింటి గడప దాటి పుట్టింటి పై పోరాటానికి” తిరిగి ఏపీ రాజకీయాలలో చెయ్యి పెట్టేలా చేసారు జగన్.
ఇలా ఇంతమందికి రాజకీయ జీవితం ఇచ్చిన జగన్…తన ‘రాజకీయ పతనానికి తానే ఆయుధాలను సిద్ధం చేసుకున్నారని’ గ్రహించలేకపోయారు. ఇదంతా చూస్తుంటే, లోకేష్ చెప్పినట్టు భస్మాసురుని చరిత్ర గుర్తురాక మానదు. వీరి రాజకీయ ఆగమనం జగన్ రాజకీయ జీవితానికి అంతంలా మారింది. షర్మిల, సునీత, భువనేశ్వరి వీరందరి రాజకీయ ప్రవేశం ఒక దుర్ఘటనతోనే మొదలయినప్పటి ‘ముగ్గురి రాకకు, పోకకు అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే కావడం అది కూడా జగన్ ఓటమే అవ్వడం జగన్ విది రాతే కావొచ్చు’.
YS Jagan has been very successful when it comes to mitigating the legal and judicial…
Actor Suriya has a message for students who spend too much time making reels, focus…