
నారా లోకేశ్ తన పార్టీ కార్యకర్తలతో అక్కడకు చేరుకొన్నప్పుడు, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అనుచరులు వారిని అడ్డుకొన్నారు. ‘అసలు ఇక్కడ మీకేమి పని…ఎందుకు వచ్చారిక్కడికి?’ అంటూ అడ్డుకొని నిలదీశారు. దీంతో ఇరువర్గాల మద్య వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. సరిగ్గా అప్పుడే వెనక నుంచి వైసీపీ కార్యకర్తలు రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. వాటిలో ఓ రాయి నారా లోకేశ్‌కు తలకు తగలవలసిందే కానీ కాస్తాలో తప్పి పక్కనే పడింది. దీంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.
ఈ సందర్భంగా నారా లోకేశ్ వైసీపీ నేతలు, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “వైసీపీ గూండాలు రాళ్ళతో దాడులు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు టిడిపి ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటుంది. మొన్న హాస్పిటల్‌లో ఉన్న అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తే ఆయనపై కేసులు పెడతారా?
ఇప్పుడు నేను బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే మాపైనే రాళ్ళ దాడి చేస్తారా? అసలు రాష్ట్రంలో చట్టం, పోలీస్ వ్యవస్థ వంటివి ఏమైనా ఉన్నాయా లేదా?అధికార పార్టీ గూండాలు ఇంతింత రాళ్ళతో ప్రతిపక్ష నేతపై దాడులు చేస్తుంటే పోలీసులు ఏమి చేస్తున్నారు?
అధికార పార్టీకి భయపడి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోంటారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? రాష్ట్రంలో జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలులోకి వచ్చిందా?
గుంటూరులో మహిళపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసి హత్య చేస్తే, ఇంకా పోస్టుమార్టం రిపోర్ట్ రాకమునుపే ఆమెపై అత్యాచారం జరుగలేదని గుంటూరు అర్బన్ ఎస్పీ ఏవిదంగా చెప్పారు?అసలు ఈ కేసులో దోషులను పట్టుకొని శిక్షించే ప్రయత్నం చేయకుండా దోషులను కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?
రాష్ట్రంలో దిశ చట్టం అమలులోకి తీసుకువచ్చామని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటోంది. మరి ఆ చట్ట ప్రకారమే హత్యాచారానికి పాల్పడిన దోషులపై 21 రోజులలో చర్యలు తీసుకొంటారా? అప్పటివరకూ మేము వేచి చూస్తాము. దిశ చట్టం కింద ముగ్గురు దోషులపై కేసులు నమోదు చేసి ఉరి శిక్ష విధించాలి. ఒకవేళ అప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడుతాము,” అని నారా లోకేశ్ ప్రభుత్వాన్ని, పోలీసులను చాలా తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
నేడు ప్రధాని మోడీ హైదరాబాద్‌లో హెచ్ఐసిసిలో రూ. కోట్లు9,377 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ…
Bhumi Pednekar has been at the centre of discussions on social media for quite some…