
ప్రతిపక్షాలు వేసే పద్మ వ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటూ స్క్రిప్ట్ మార్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన గెలుపు కోసం తన సైన్యంతో కొన్ని వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఆ వ్యూహాలతో చిక్కుకోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారో లేదో రానున్న రోజులలో తెలుస్తుంది.
ఇప్పటికే యాత్ర తో ముందుకొచ్చిన వైసీపీ వ్యూహంలో చిక్కుకోకుండా ఏపీ ప్రజలు అర్జునిడిలా నిలబడి అధికార పార్టీ నేతలకు షాక్ ఇచ్చారనే చెప్పాలి. అయితే ఈసారి తమ ఆస్థాన దర్శకుడుగా పేరుపొందిన ఆర్జీవీ తో వ్యూహం, శపధం అంటూ ఏపీ ప్రజల మీద తమ మరో రెండు రాజకీయ వ్యూహాలను అమలుచేయడానికి సిద్ధమయ్యారు.
అయితే రాష్ట్ర ప్రజలు ఈ వైసీపీ వ్యూహంలో చిక్కుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కురుక్షేత్రం మధ్యలో నేలకొరిగిన అభిమన్యుడి మాదిరి చంపుకుంటారో…, లేక వ్యూహాలని ఛేదించే అర్జునిడిలా పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకుంటారో…చూడాలి. ఇక ఇక్కడ అన్నేమో నేను అర్జునిడిని అంటూ జాకీలేసుకుంటే చెల్లెలేమో వైసీపీ ని ‘కాలకేయ’ సైన్యంతో పోలుస్తుంది. మరి ఏపీలో జరుగుతుంది పురాణాల ఆధారిత చరిత్రా..? లేక ఊహాజనిత చిత్రమా..?
ఇప్పటికే తన పాదయాత్రను మాత్రమే చూపిస్తూ జగన్ ను ఒక హీరోగా తెరకెక్కించిన యాత్ర ఒక్క వైసీపీ మద్దతుదారులకు తప్ప మరెవరిని మెప్పించలేకపోయింది. తాజాగా విడుదలకు సిద్దమైన వ్యూహం ,శపధం రిలీజ్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ వ్యూహంలో ప్రత్యర్థి పార్టీనేతలే అసలైన విలన్లు అన్నటుగా చిత్రీకరించారు.
చంద్రబాబు, పవన్, లోకేష్ అంటూ విపక్ష సభ్యులను కించపరిచి పైశాచిక ఆనందం పొందాలి అనుకుంటున్న చిత్ర దర్శకుడికి, ఆ దర్శకుడి వెనుక ఉండి నడిపిస్తున్న సూత్రదారులకు చెక్ పెట్టడానికి రాజధాని ఫైల్స్ రెడీగా ఉండి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల మన్నన పొందిన విషయం తెలిసిందే.
ఈ నెల 23 న వ్యూహం, మార్చి 1 న శపధం అంటూ మరో ఛాన్స్ కోసం థియేటర్ల ముందుకు వస్తున్నాయి ఈ చిత్రాలు. అయితే చట్టబద్దం గా విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్న వ్యక్తులను కించపరిచే వైసీపీ నాయకులు ‘వేమన గారి నీతి శతకాలు’ చదివే ముఖ్యమంత్రి గారు ఆర్జీవీ వంటివారి అస్లీల చిత్రాలు తీసే దర్శకుడి పంచన చేరి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారో..? ఒక్కసారి చెప్పగలరా?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…