Telugu

జగన్ వెన్నపూస నొక్కుళ్ళు.?

ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన టీడీపీ అంటే మండిపాటు విమర్శలు, బీజేపీ అంటే వెన్నపూస నొక్కులు వైసీపీ రాజకీయంలో ఒక భాగమే. అయితే ఆ రాజకీయాన్ని మరింత బలంగా చెప్పేందుకు పార్టీ క్యాడర్ కు చూపేందుకు జగన్ తెగ తాపత్రయ పడుతున్నట్టు కనిపిస్తున్నారు.

అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రులకు జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే కొత్త అలవాటును అలవరచుకున్నారు. ఇందుకు గాను మొన్న తెలంగాణ బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన జగన్ నేడు మరో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు శుభాకంక్షాలు తెలిపారు.

ADVERTISEMENT

అయితే ఈ మెసేజ్ లో కిషన్ రెడ్డిని తన మిత్రుడిగా పేర్కొన్నారు జగన్. అయితే గతం నుంచి కూడా జగన్, కిషన్ ల మధ్య మంచి సానుకూల సంబంధాలు ఉన్నాయంటూ అవి కిషన్ ను టీడీపీ వ్యతిరేకుడిగా చేసినట్టు రాజకీయ వర్గాలలో గట్టి ప్రచారమే జరిగింది. వీరిద్దరూ ఒకే సామజిక వర్గానికి చెందిన నాయకులు కావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరిన మాట వాస్తవం.

జగన్ నాడు, నేడు ఎప్పుడు బీజేపీ కి వ్యతిరేకంగా అడుగులు ముందుకు వేసిందే లేదు. అలాగే బీజేపీ దత్తపుత్రుడిగా జగన్ కు మంచి ప్రచారము ఉంది. బీజేపీతో జగన్ కు ఉన్న తెరచాటు అనుబంధాల కారణంగానే జగన్ అక్రమాస్తుల కేసు నుంచి వివేకా హత్య కేసు వరకు వైసీపీ కి వ్యతిరేకంగా న్యాయస్థానాలలో ఒక్క అడుగుకు కూడా ముందుకు సాగడం లేదు అనే వాదన ఏపీ వ్యాప్తంగా బలంగా వినిపిస్తుంది.

ఇక నేడు వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో పాటు అటు పార్లమెంట్ లో కూడా నానాటికి వైసీపీ బలం క్షిణిస్తుంది. దానికి తోడు ఇటు ఏపీలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుంది. ఫలితంగా టీడీపీ, వైసీపీ కేసుల విషయంలో బీజేపీ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు.

అందుచేత వైస్ జగన్ కేంద్ర పెద్దలతో ముఖ్యంగా బీజేపీ నాయకులతో వెన్నతో పూసిన మెత్తటి మాటలు మాట్లాడేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. తద్వారా బీజేపీ జాతీయ నాయకులను ఆకట్టుకునే పథకాలు రచిస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

6 hours ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

6 hours ago