
రాజకీయాలందు వైస్ జగన్ రాజకీయాలు వేరయా అన్న చందంగా మారుతున్నాయి వైసీపీ రాజకీయాలు. వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి నోటితో చెప్పిన మాటలను కళ్ళతో కాదంటారా.? లేక కళ్ళతో చూసిన దృశ్యాలను నోటితో వద్దంటారా.? అన్నట్టుగా ఒక పక్క ప్రాణాలతో లేని తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి కి దండాలు పెడుతూ దేవుడిలా కొలుస్తున్నారు.
మరోపక్క ప్రాణాలతో ఉన్న తల్లి విజయలక్ష్మి పై ఆస్తి విభేదాలతో కోర్టులో కేసులు వేస్తూ దెయ్యంలా ప్రచారం చేస్తున్నారు. నేడు మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ పేరు మీద కార్యక్రమాలను నిర్వహించిన వైసీపీ వైఎస్ఆర్ ను జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
ఇక వైస్ జగన్ ‘ఐ మిస్ యు డాడీ’ అంటూ తన సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ ను ఉద్దేశించి పోస్ట్ లు పెట్టారు. అయితే లేని తండ్రి కోసం ఇంతలా పరితపిస్తున్న వైస్ జగన్ ఉన్న తల్లిని పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుండి ఎందుకు తొలగించారు.? ఏపీ నుండి ఎందుకు తరలించారు.? చెల్లి షర్మిలను ఎందుకు తరిమేశారు.?
వైఎస్ఆర్ ఆస్తుల మీద హక్కుల కోసం తల్లి విజయలక్ష్మి మీద న్యాయస్థానంలో కేసులేందుకు పెట్టారు.? తల్లిని కోర్టుకెందుకు లాగారు.? చెల్లి షర్మిల పుట్టుక గురించి ఎందుకు నీచంగా మాట్లాడించారు.? ఇదంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న ప్రేమతోనే చేసారా.? లేక తల్లి చెల్లి మీద పగ సాధించడానికి చేస్తున్నారా.?
“తండ్రిని ప్రేమించు…తల్లిని ద్వేషించు…చెల్లిని దూషించు” ఇవేనా జగన్ చెప్పే విలువలు, వైసీపీ పాటించే విశ్వసనీయత.? రాజశేఖర్ రెడ్డి విగ్రహాలతో, విజయమ్మ ను వద్దనుకుంటున్నారా.? షర్మిలను వదులుకుంటున్నారా.? ‘ఐ మిస్ యు డాడీ’…అంటూ జగన్ చేసిన ఈ ఒక్క పోస్ట్ వెనుక ఇలాంటి వేల ప్రశ్నలెన్నో వైసీపీ ని వెంటాడుతున్నాయి.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…