
టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి నారా లోకేష్ వరకు వైసీపీ పార్టీని గొడ్డలి పార్టీగా అభివర్ణిస్తూ వైసీపీ నేతలను ఇరుకున పెడుతున్నారు.
ఈ నెల 28 న విశాఖ తీరంలో AI గూగుల్ సెంటర్ ఏర్పాటు సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడతూ మాది గూగుల్ మీది గొడ్డలి అంటూ సంబోధించారు. ఇక అక్కడి నుంచి సోషల్ మీడియాలో వైసీపీ పై ‘గొడ్డలి పార్టీ’ అంటూ ట్రోలింగ్ షురూ అయ్యింది.
ఇటు సీఎం చంద్రబాబు సైతం వైసీపీ పార్టీ ని ఉద్దేశిస్తూ ఆ పార్టీ గొడ్డలి పార్టీ అంటూ వ్యాఖ్యానించడంతో ఇక టీడీపీ శ్రేణులంతా వైసీపీ ని గొడ్డలి పార్టీ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. దీనితో వైసీపీ కి మండినట్టు ఉంది.
ఇక టీడీపీ చేస్తున్న ఆ గొడ్డలి ప్రచారం ఇలానే కొనసాగితే వైఎస్ వివేకా హత్య తాలూకా రక్తపు మరకలు వైసీపీ కి అంటే ప్రమాదం ఉందని గ్రహించిన వైసీపీ నేతలు ఎదురుదాడికి సిద్ధమయ్యారు. తమ పార్టీ పై టీడీపీ అధినాయకత్వం వేస్తున్న గొడ్డలి నీడలను తొలగించుకునేందుకు రంగంలోకి దిగిన వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని టీడీపీ ని వెన్నుపోటు పార్టీ అంటూ విమర్శిస్తున్నారు.
వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రెస్ అని, అటువంటి నాయకుడు ఇప్పుడు వైసీపీ ని గొడ్డలి పార్టీ అంటూ విమర్శించడం శోచనీయమంటూ టీడీపీ పై విరుచుకుపడ్డారు. పదేపదే వైసీపీ ని గొడ్డలి పార్టీ అంటూ టీడీపీ శ్రేణులు ట్రోలింగ్ కి దిగితే టీడీపీ పార్టీని కూడా వెన్నుపోటు పార్టీ అంటూ పిలవాల్సి వస్తుందంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు రజని.
దీనితో లోకేష్ ఎత్తుకున్న గొడ్డలి నినాదం చిలికి చిలికి వైసీపీ లో మంట రేపిందని స్పష్టమవుతుంది. ఇక ఆ పార్టీ నేతలను ఉద్దేశించి కూడా మండిందా అక్కా.? మండిందా అన్నా.? అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ఊపందుకుంటున్నాయి.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…