జనసేన… వైసీపీ ఫ్యాన్ కు రెగ్యూలేటర్ కానుందా?

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఎన్నికలు సిద్దమైన జనసేన ప్రధమ కర్తవ్యం రాష్ట్రంలో 151 సీట్లతో వీచిన వైసీపీ ఫ్యాన్ ను కట్టడి చేయడమే. రెగ్యూలేటర్ ఏవిధంగా అయితే ఫ్యాన్ స్పీడ్ ను కంట్రోల్ చేయగలదో…అలాగే జనసేన కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి వైసీపీ ని కట్టడి చేయగలదు.

రెగ్యూలేటర్ కు ఎలా అయితే పూర్తిగా ఫ్యాన్ ను ఆపే పవర్ లేదో అలాగే జనసేనకు కూడా వైసీపీ ని ఓడించేంత పూర్తి బలం లేదు. కానీ వైసీపీ విజయాన్ని అడ్డుకునేంత శక్తి మాత్రం జనసేనకు ఉందనేది గత ఎన్నికల గణాంకాలతో స్పష్టమయింది. 2019 ఎన్నికలలో జనసేన – టీడీపీ విడివిడిగా పోటీ చేయడం వలన రాష్ట్రంలో వైసీపీ ఫ్యాన్ కు ఈస్థాయిలో పవర్ వచ్చిందనేది జగమెరిగిన సత్యమే.

ADVERTISEMENT

దాని పర్యవసానమే ఏపీలో ఈ అరాచక పాలన, విధ్వంసకర విధానాలు అనేది పవన్ కూడా గ్రహించడంతో ఈసారి ఆ అవకాశాన్ని వైసీపీ కి ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో తాను తగ్గి, తన పార్టీ బలాన్ని తగ్గించుకుని మరి టీడీపీ – జనసేన – బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిర్చారు. విపరీతమైన గాలితో ఎలా అయితే ఆస్తుల విచ్ఛిన్నం జరుగుతుందో…అలాగే రాష్ట్రంలో వైసీపీ ని ప్రతిపక్షానికి పరిమితం చేయకపోతే రాష్ట్ర విచ్ఛిన్నం కూడా తప్పదు అనేది పవన్ ఆలోచన.

ఈ నేపథ్యంలో భాగంగానే పవన్ తన పార్టీ భవిష్యత్తుని ఒక అడుగు వెనక్కి లాగి రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడడుగులు ముందుకు వేశారు. 2019 ఎన్నికలో దాదాపు 25 నుంచి 30 స్థానాలలో టీడీపీ విజయావకాశాన్ని దెబ్బతీసి వైసీపీ గెలుపుకు జనసేన పరోక్ష సహకారం చేసింది. అలాగే దాదాపు 10 నుంచి 15 స్థానాలలో టీడీపీ కూడా జనసేన విజయాన్ని అడ్డుకుంది. ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వలన వచ్చిన సువర్ణ అవకాశాన్ని వైసీపీ చాల చక్కగా వినియోగించుకోగలిగింది.

అందుకే పదేపదే వైసీపీ నాయకులు అటు టీడీపీ, ఇటు జనసేన నాయకులను, కార్యకర్తలను దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అంటూ రెచ్చగొట్టి ఆ మంటలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఈసారి వైసీపీ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు రాబోయే కాలంలో టీడీపీ తో జనసేన పొత్తు ఉంటుంది అనే సంకేతాలు ఇస్తూనే వచ్చారు.

అయినా కూడా ఎలా అయినా ఈ రెండు పార్టీల మధ్య పొత్తును విచ్ఛిన్నం చేయాలనీ శతవిధాలా తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే వస్తున్నారు వైసీపీ నేతలు. రాబోయే ఎన్నికల ప్రచారంలో పవన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను పూర్తి గా ప్రజలలోకి తీసుకువెళ్లగలిగితే ఒక పార్టీ విజయాన్ని కట్టడి చేసే రెగ్యూలేటర్ స్థాయి నుంచి తన పార్టీ గెలుపుని శాసించే పవర్ స్థాయికి ఎదగలుగుతారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Ranabaali US: Advance Sales & Breakeven Target No Sync

Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…

6 hours ago

AK47 New Date: Trivikram About to Break His Promise?

After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…

6 hours ago