
‘మూలిగే నక్క మీద తాటికాయ’ పడ్డ సామెత విన్నారా! ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. తిరుమల లడ్డు అంశంలో పూర్తిగా ఇరుక్కుపోయిన జగన్ మోహన్ రెడ్డి పరువును మాజీ నగరి ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియా వేదికగా తీసేసింది.
అసలైన చెల్లెలు షర్మిలను పక్కనపెట్టి, ప్రతి ఏడాది రోజాతో రాఖీ కట్టించుకుంటున్న జగన్ ను ఇరుకున పెట్టే విధంగా తన యూ ట్యూబ్ ఛానెల్ లో నిర్వహించిన ఓ పోల్, సోషల్ మీడియా అంతటా దావానంలా వ్యాపించింది. దీంతో మరోసారి జగన్ సోషల్ మీడియా ట్రోలింగ్ కు గురికావాల్సి వచ్చింది.
తిరుమల లడ్డూను కల్తీ చేసింది ఎవరు? అని నిర్వహించిన పోల్ లో 74 శాతం మంది జగన్ మోహన్ రెడ్డికే ఓటు వేయగా, ఎవరి పాలనలో తిరుమల బాగుందని? వేసిన మరో ప్రశ్నకు 77 శాతం మంది చంద్రబాబుకు ఓటు వేయడంతో, రోజా అవాక్కయింది.
రోజా ఫాలోయర్స్ అంటే సహజంగా వారి పార్టీకి చెందిన వారే ఎక్కువగా ఉంటారు. అలాంటిది ఆమె ఫాలోయర్స్ ఆమెకు జలక్ ఇవ్వడం కొసమెరుపు. ఇది రోజా పరువుతో ముడిపడి ఉంటే పెద్దగా ప్రాధాన్యత దక్కేది కాదు.
కానీ ఇందులో జగన్ మోహన్ రెడ్డి పేరు ప్రముఖంగా ఉండడం, దానికి వ్యతిరేకంగా పోల్ ఫలితాలు రావడంతో వైసీపీ అధినేత ట్రోలింగ్ మెటీరీయల్ అయ్యారు. జగన్ ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రతిసారీ నెటిజన్లను అలరిస్తూ వినోదాన్ని పంచుతూనే ఉంటారు, అయితే ఈ సారి రోజా కూడా తన వంతు సాయం చేసిందనే చెప్పాలి.
తిరుమల లడ్డు కల్తీ అంశంతో పాటు స్వామి వారి దర్శనం టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా రోజా మరియు వైవీ సుబ్బారెడ్డిలపై వెల్లువెత్తుతున్నాయి. కోట్ల స్కామ్ గా వినపడుతోన్న ఈ అంశంలో మరిన్ని వివరాలు బహిర్గతం కావాల్సి ఉంది.
ఏది ఏమైనా కలియుగ దైవం సాక్షిగా చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బట్టబయలు అవుతుండడం భక్తులకు, ప్రజలకు ఊరటనిచ్చే విషయం. ఇలాంటి విషయాలలో ఎవరినీ ఉపేక్షించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రజల ఆకాంక్ష.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…