
గత కొన్ని రోజులుగా వైసీపీ నేతల వ్యక్తిగత సమస్యలు రోడ్డునపడ్డాయి. ఒకరు అడల్ట్రీ సంబంధంతో భార్య బిడ్డలకు అన్యాయం చేస్తున్నారని, మరొకరు సరొకసితో భార్య భర్తల బంధాన్ని చీలుస్తున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
అయితే ఇందులో ఒకరు డీన్ఏ టెస్టుల వరకు వెళితే, వేరొకరు డైవర్స్ నోటీసుల వరకు లాక్కెళ్లారు. ఒకరు డాక్టర్లను నమ్ముకుంటే వేరొకరు లాయర్లను నమ్ముకున్నారు. అయినా ఈ వైసీపీ నేతల కుటుంబ పంచాయితీలకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు.
ఈ నేపథ్యంలో ఇలా అక్రమ సంబంధాలు, కుటుంబ వ్యహారాలలో వచ్చే తగాదాలు, లీగల్, నాన్ లీగల్ ఇష్యూ లను సెటిల్ చెయ్యడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రోజా ను వదిలి పెట్టి వైసీపీ నేతలు పక్క చూపులు చూడడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
బతుకు జట్కా బండి కార్యక్రమంతో ఎందరో జంటల సమస్యలు ‘సూపర్ ఉమన్’ మాదిరి చిటికలో సరిచేశారు వైసీపీ మాజీ మంత్రి రోజా. ఒక భర్త ఉండగా విడాకులు తీసుకోకుండా మరొకరితో వెళ్లడం తప్పని నీకు తెలియదా అంటూ బతుకు జట్కా బండిలో రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రకారంగా దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ కొనసాగిస్తున్న అడల్ట్రీ సంబంధం చట్ట వ్యతిరేకమని తేలిపోయింది. బాధితులను, నిందితులను ఇక దగ్గరకు చేర్చి రోజా చేసే బెదిరింపులు, హెచ్చరికలు చూస్తుంటే ప్రతి సీన్ ఒక క్లైమాక్ మాదిరి కార్యక్రమం మొత్తం బీప్ సౌండ్లతో మారుమోగుతూ ఉంటుంది.
ఇటువంటి పంచాయితీలకు బెదిరించో, భయపెట్టో సెటిల్మెంట్లు చెయ్యడం రోజాకు బూతులు తిట్టినంత ఈజీ. దువ్వాడ సమస్యకు ఒక పరిష్కారం దొరకాలన్నా, విజయ సాయి వివాదానికి ముగింపు తెలియాలన్న పోయిరావలె “బతుకు జట్కా బండి” కి అనేలా రోజానే రావాలి, రోజానే కావాలి అంటున్నారు బతుకు జట్కా బండి ప్రేక్షకులు.
వైసీపీ పార్టీ తన పార్టీ గళం వినిపించడానికి అధికార ప్రతినిధులను నియమిస్తున్నట్లే, తమ పార్టీ నేతల వ్యక్తిగత వివాదాల పరిష్కారానికి కూడా ఒక అధికారిక పదవిని సృష్టించి దానికి అధ్యక్షురాలిగా రోజాను నియమించాలి అనే డిమాండ్ సోషల్ మీడియాలో గట్టిగా వినపడుతుంది.
The Department of Homeland Security (DHS) had proposed to end a major H-1B extension rule.…
Generally, when too big films are arriving at the ticket counter correspondingly, there is a…