
‘రాంగోపాల్’ వర్మ ఒకప్పుడు ‘శివ’ సినిమాతో టెక్నీకల్ గా తెలుగు సినిమా రూపాన్ని మార్చిన దర్శకుడిగా బాలీవుడ్ వరకు పేరు సంపాదించిన దర్శకుడు. రానురాను హర్రర్ మూవీస్ తీసి ప్రేక్షకులను భయపెట్టాలని చూసి అవి కుదరక చివరకు ఆర్జీవీ మూవీ తెరకెక్కిస్తున్నాడు అంటేనే సినీ ప్రేక్షకుడు భయపడే స్థాయికి చేరుకున్నాడు.
‘టాలీవుడ్ సెన్సెషనల్’ దర్శకుడి నుండి ‘బూతు సినిమాలకు దర్శకత్వం’ వహించే స్థాయికి దిగజారి ఇప్పుడు వైసీపీ రాజకీయ వ్యూహాలలో చిక్కుకుని వ్యూహం దర్శకుడి అవతారమెత్తాడు ఆర్జీవీ. ఆడవారి హక్కులను కాపాడడానికే రాజకీయాలకు వచ్చాను అని చెప్పుకునే రోజా ఆడవారి శరీరాల పై సినిమాలు తీసి వ్యాపారం చేసుకునే ఆర్జీవీ నీ ఆకాశానికెత్తడం ఎంతవరకు సమంజసమో ఆమె సమాధానం చెప్పాలి.
ఒక సినిమా వేదిక మీద రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన వైసీపీ గ్యాంగ్ మొత్తం ఇప్పుడు వ్యూహం సినిమా వేదిక మీద జగన్ భజనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పై ప్రజలకు ఏం సమాధానము చెపుతారు. వచ్చింది సినిమా ప్రమోషన్ కోసం కానీ అక్కడ కూడా రాజకీయ విమర్శలే. రోజా అయితే లోకేష్ ను పప్పు, వాడు వీడు, ఒక్కొక్కోడికి తడిచిపోతుంది అంటూ మాట్లాడి మరో సారి తన మంత్రి పదవికి ఉన్నా హుందాతనాన్ని అవమానించారు.
ఆర్జీవీ సినిమా స్థాయి ఏమిటో ఇప్పుడు తెలుగు ప్రజలందరికి ముఖ్యంగా మహిళలకు తెలిసిన విషయమే. అటువంటి ఆర్జీవిని వైసీపీ మంత్రులు ఒక్కొక్కరు పోటీపడి మరీ వీరుడు – సూరుడు అంటూ ఆకాశానికి ఎత్తేసారు. పరోక్షంగా తన పై రెండు పంచ్ డైలాగ్స్ ఉంటేనే సినిమా పరిశ్రమ మొత్తానికి వార్నింగ్ ఇచ్చిన మంత్రి రాంబాబు గారు ఇప్పుడు ఏకంగా రెండు పార్టీల నేతలను కించపరుస్తూ సినిమా తీస్తే దానికి మంత్రుల హోదాలో మీరు మద్దతుగా నిలబడడం ఏంటి? అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి …..పనులని అర్థమా..? అంటూ నిలదీస్తున్నారు టీడీపీ, జనసేన అభిమానులు.
ఒక ఆర్జీవీ లాంటి దర్శకుడితో జగన్ సినిమా తీయించుకున్నాడు అంటేనే అర్ధమవుతుంది ఆయనకు మద్దతుగా సినిమా తీయడానికి తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు ముందుకు రాలేదని అంటూ మండిపడుతున్నారు టీడీపీ తమ్ముళ్లు. ఆ సినిమా ప్రమోషన్ కోసం వైసీపీ మంత్రులు, మాజీలు రోజా, అంబటి, జోగి రమేష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఇలా ఒక సైన్యాన్నే దింపారు.
పందులే గుంపుగా వస్తాయి, జగన్ సింహం సింగల్ గా వస్తాడు అంటూ సినిమా డైలాగ్స్ కొట్టే వైసీపీ నేతలు మరీ ఒక్క సినిమా కోసం ఇంతమందినీ గుంపుగా తెచ్చారు ఎందుకో. మరీ ఈ గుంపు నీ ఏమంటారో కూడా ఆ వైసీపీ నేతలు సెలవిస్తే బాగుంటుంది.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…