
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేటలో సోమవారం గడపగడపకు కార్యక్రమం జరిగింది. రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అనంత బాబు అనుచరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ‘అనంతబాబు జిందాబాద్…’ అని నినాదాలు చేస్తూ ఆర్అండ్‌బీ ప్రధాన రహదారిపై అతని చిత్ర పఠంతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అతని చిత్ర పఠానికి పాలాభిషేకం చేశారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్లు అనంత బాబు స్వయంగా ఒప్పుకొని జైల్లో ఉండగా, అతను ఏదో ఘనకార్యం చేసినట్లుగా అతని అనుచరులు అతని చిత్ర పఠంతో ర్యాలీ నిర్వహించి పాలాభిషేకం చేయడమే విడ్డూరం అనుకొంటే, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఓ ఎమ్మెల్యే పాల్గొంటున్న అధికారిక కార్యక్రమంలో ఓ హంతకుడికి వైసీపీ కార్యకర్తలు జిందాబాద్ నినాదాలు చేస్తుంటే, ఎమ్మెల్యే వారించకపోవడం, పోలీసులు పట్టించుకోకపోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.
తద్వారా అనంతబాబుకి వైసీపీ ప్రభుత్వం పూర్తి అండదండలున్నాయని స్పష్టం అవుతోంది. అటువంటప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరుగుతుందని, అనంతబాబుకి శిక్ష పడుతుందని ఏవిదంగా నమ్మగలము?
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…