
పోస్టుమార్టం నివేదికలో ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం రెండు చేతులు బందించి కొట్టినట్లు పేర్కొన్నారు. అతని తల, రెండు కాళ్ళపై గాయాలున్నాయని, మర్మావయంపై బలంగా తన్నినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదిక ప్రకారం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని బందించి కొట్టడంతో చనిపోయినట్లు స్పష్టమైంది.
సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ప్రతిపక్షాలు, దళిత సంఘాలు, హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్, వారికి అండగా నిలబడి గట్టిగా పోరాడినందునే మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, హత్య కేసుగా నమోదు చేసి వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని ఈ కేసులో ఏ-1 నిందితుడిగా పేర్కొంటూ అతనిపై ఐపీసీ 302, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని భావించవచ్చు.
కానీ ఇటువంటి కేసులలో ప్రతిపక్షాలకు చెందిన వారెవరైనా ఉన్నట్లు గుర్తిస్తే గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసే పోలీసులు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబును నాలుగు రోజులైనా అరెస్ట్ చేయకపోవడమే అనుమానాలకు తావిస్తోంది. నేటికీ మంత్రులు, వైసీపీ నేతలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య గురించి నోరు విప్పి మాట్లాడక పోవడమే ఇందుకు మరో నిదర్శనం. అనంత బాబు అధికార పార్టీ ఎమ్మెల్సీ కావడం, సిఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడం చేతనే పోలీసులు అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ, తల్లితండ్రులు, ప్రతిపక్షాలు, హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ ఆరోపిస్తున్నారు.
కానీ పోలీసులు వారి ఆరోపణలను ఖండిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనంత బాబు కోసం గాలిస్తున్నామని చెపుతున్నారు. కనుక ఈ దొంగా-పోలీస్ ఆట ఇంకెన్నాళ్ళు సాగదీస్తారో చూడాలి. చివరికి డ్రైవర్ సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలోనే చనిపోయాడని, కనుక ఈ కేసుతో అనంత బాబుకి ఎటువంటి సంబందమూ లేదంటూ పోలీసులు అతనిని కాపాడుతారో లేక నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి శిక్ష పడేలా చేస్తారో చూడాలి.
Megastar Chiranjeevi recently met acclaimed Malayalam filmmaker Tharun Moorthy at his Hyderabad residence, sparking immediate…
Ram Charan's Peddi, directed by Buchi Babu Sana, has already emerged as one of the…