
సాధారణంగా ఆషాడం ఆఫర్స్ వన్ ప్లస్ వన్, 70 % డిస్కౌంట్ అంటూ వస్త్ర వ్యాపారాలు వాణిజ్య ప్రకటనలు చేస్తూ వినియోగదారులను ఆకర్షించేందుకు తెగ హంగామా చేస్తారు. అయితే ఇప్పుడు ఈ హంగామా మొత్తం వైసీపీ లో కనిపించేలా ఉంది.
ఒక పక్క జగన్ పర్యటనలతో వైసీపీ క్యాడర్ ను రెచ్చకొడుతూ రప్ప రప్ప డైలాగ్ తో పోస్టర్లు పెడితే తప్పేముంది అంటూ పార్టీ కార్యకర్తలను కేసులలో ఇరికిస్తున్నారు.
మరోపక్క అధికారంలో ఉన్నప్పుడు స్కాం లు చేస్తే నేరమా అంటూ పార్టీ ముఖ్య నాయకుల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు అరెస్టులు చేపిస్తున్నారు. ఇలా వైసీపీ పార్టీలో ఆషాడం ఆఫర్ వన్ ప్లస్ వన్ మాదిరి క్యాడర్ తో పాటు లీడర్లు అరెస్టలవుతూ కటకటాల వెనక్కి వెళుతున్నారు.
అందగాళ్ళు, సౌమ్యులు అంటూ పార్టీ నాయకులను రెచ్చకొడుతున్నారు, అమాయకులు, చిన్న పిల్లలు అంటూ పార్టీ క్యాడర్ ను హింసకు ప్రేరిపిస్తునారు. ఇప్పటికే ఈ నెల జగన్ పర్యటనలు, పరామర్శల పేరుతో రప్ప రప్ప అంటూ అనేకమంది వైసీపీ కార్యాకర్తల మీద కేసులు వేశారు.
ఇక వైసీపీ డీఎన్ఏ లో భాగమైన ఆడవారిని అవమానించడంలో కూడా వైసీపీ ఎక్కడ తగ్గేదెలా అన్నట్టుగా రెచ్చిపోతుంది. నాడు వంశీ పాత్రలోకి నేడు ప్రసన్న, నాడు కొడాలి స్థానం కోసం నేడు పేర్ని…ఇలా వైసీపీ అరాచకం పాత్రధారులను మారుస్తుందే తప్ప పద్దతి మార్చుకోవడంలేదు.
ఇక వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కేసు విచారణ మిథున్ రెడ్డి వరకు వచ్చేసింది. అన్ని అనుకున్నట్టే జరిగితే కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డి అరెస్టు తో వైసీపీ కి రాజకీయంగా ఒక పెద్ద ఝలక్ ఇచ్చినట్టే అవుతుంది.
అలాగే మిథున్ రెడ్డి అరెస్టుతో లిక్కర్ కేసులో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ నడిచే అవకాశం లేకపోలేదు. అయితే ఆ ఆఫర్ దక్కించుకునే మరో వైసీపీ నేత ఎవరవుతారనేది ఇక్కడ సస్పెన్స్.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…