
రివ్యూలు, టాక్ లతో సంబంధం లేకుండా ఒక హీరో సినిమాని థియేటర్లలో చూడాలి అనే మైండ్ సెట్ ను బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు. బడా హీరోల సినిమాల విషయంలోనూ కూడా ఆడియన్స్ ఇంత లిబలరల్ గా ఉండడం లేదు. కానీ.. నాని, నవీన్ పోలిశెట్టి, అడివి శేష్ లాంటి యువ కథానాయకులు మాత్రం ఆ గుడ్ విల్ ని బిల్డ్ చేసుకోగలిగారు.
ఇదేదో ఒక సినిమాతో వచ్చింది కాదు.. ఏళ్ల తరబడి మంచి సినిమాలు అందించి వాళ్లు సంపాదించుకున్న క్రెడిబిలిటీ. హీరోగా నాని తన స్టార్ డమ్ ను బిల్డ్ చేసుకుందే ఆ క్రెడిబిలిటీతో. అందువల్ల అతడి మునుపటి సినిమాలు కంటెంట్ పరంగా పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఓవర్సీస్ కలెక్షన్స్ & ఇండియాలో రిసెప్షన్ మీద ఏమాత్రం ఎఫెక్ట్ పడలేదు.
నవీన్ పోలిశెట్టి కూడా తన తాజా చిత్రం “అనగనగా ఒకరాజు”తో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయినా 100 కోట్ల పోస్టర్ వేసుకోగలిగాడు. అతడి మునుపటి సినిమాలు “ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” వంటి సినిమాలతో హిట్లు కొట్టాడు కాబట్టే గట్టెక్కగలిగాడు.
తాజాగా ఈ లిస్ట్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు అడివి శేష్. “క్షణం” మొదలుకొని “హిట్ 2” వరకు తాను బిల్డ్ చేసుకున్న గుడ్ విల్ “డెకాయిట్”కి కూడా ఉపయోగపడింది. అమెరికాలో 1 మిలియన్ కలెక్ట్ చేయడమే కాక, ఇండియాలోనూ ఎవరికీ నష్టం లేకుండా డీసెంట్ కలెక్షన్స్ తో ముందుకు వెళ్తుంది సినిమా.
అయితే ఈ గుడ్ విల్ అనేది గేమ్ లో ఒక లైఫ్ లాంటిది. అన్నిసార్లు వాడుకోవడానికి పనిచేయదు. చాలా కీలకమైన సమయంలో మాత్రమే అక్కరకు వస్తుంది. మన యంగ్ హీరోస్ ఈ గుడ్ విల్ ఫ్యాక్టర్ ను మరీ అరిగిపోయేలా వాడకుండా, తమ క్రెడిబిలిటీ & ట్రస్ట్ లెవల్స్ ను సినిమాలతో మరింత పెంచుకోవాలి.
Nikita Sharma is turning up the tropical heat with her latest breathtaking beach photoshoot, proving…
After the back to back failures of Toxic and Hi, Nayanthara's next release will most…