Telugu

మరచిపోలేని మార్చ్ ను మళ్ళీ గుర్తుచేస్తారా..?

2025 మార్చ్ నెల లో మన సీనియర్స్ అందరు కలిసి ఉన్న జట్టు తో ఛాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగారు. ఆ టోర్నమెంట్ తొలుత పాకిస్తాన్ దేశాన్నే ఎంపిక చేసినప్పటికీ, భారత బోర్డు పట్టు బిగించే సరికి కేవలం భారత్ ఆడబోయే మ్యాచ్లను మాత్రం దుబాయ్ క్రికెట్ గ్రౌండ్ కు తరలించారు.

అయితే, ఆ టోర్నమెంట్ లో ఒక్క మ్యాచ్ లో కూడా ఓడకుండా, ఫైనల్స్ కు చేరుకొని, ఫైనల్స్ లో కూడా అదే పై చేయి సాధించి కప్పును ముద్దాడారు భారత ఆటగాళ్లు.

ADVERTISEMENT

ఈ ఛాంపియన్స్ ట్రోఫీ లో మనం దుబాయ్ లో జయ కేతనం ఎగరేసినప్పటికీ, 2021 టి-20 వరల్డ్ కప్ మరియు 2022 ఆసియ కప్ లో భారత్ కనీసం సెమీస్ ను కూడా చేరకుండానే టోర్నీ నుండి నిష్క్రమించబడ్డారు.

ఆ రెండు టోర్నీలు సైతం టి-20 ఫార్మటు లోనే ఆడారు. కానీ, ఈ ఏడాది ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీ చూస్కుంటే వన్-డే ఫార్మటు లో నిర్వహించబడింది.

మరి, దుబాయ్ లో మన వాళ్ళ ప్రస్తుత టి-20 రికార్డు అంత గొప్పగా లేనప్పటికీ, మన వారు మరొక సారి దుబాయ్ వెళ్ళాక తప్పని పరిస్థితి. రేపు జరగబోయే 2025 ఆసియా కప్ ను యు.ఏ.ఈ వేదికగా నిర్వహించనుండగా, ఈసారి భారత్…విరాట్, రోహిత్, జడ్డు, రాహుల్, అశ్విన్ వంటి సీనియర్స్ ను మిస్ అవ్వక తప్పట్లేదు. కొందరు రిటైర్ అవ్వగా, మరి కొందరు టీమ్ లో తమ ప్లేస్ ను కోల్పోయారు.

అయితే, ఈ ఆసియా కప్ కోసం మన సెలెక్టర్లు జట్టును యువకులతో నింపేశారు. స్క్వాడ్ లోని చాలా మందికి యు.ఏ.ఈ లో ఆడిన అనుభవమే లేదు. సూర్య కుమార్ నేతృత్వం లో శుబ్మాన్ గిల్ వైస్-కెప్టెన్ గా ఉన్న జట్టులో, అభిషేక్, తిలక్, జితేష్, రింకు వంటి వారికి కొండంత అనుభవం లేకున్నా, ఈ ఫార్మటు లో ఇప్పటికే ఆరి-తేరిపోయారు.

ఈ నెల 10 న జరగనున్న భారత్ – యూఏఈ ల మధ్య జరగనున్న మ్యాచ్ లో ఈ యువ టీం ను సూర్య, బుమ్రా, హార్దిక్, గిల్ మరియు అర్షదీప్ ముందుండి నడపాల్సి ఉంది. అయితే, మన సీనియర్లు సైతం తడపడ్డ ఈ యు.ఏ.ఈ గడ్డ పై జూనియర్లు ఏ మేరకు లాక్కొస్తారు అనేది చూడాల్సి ఉంది.

ప్రస్తుతం, ఉన్న జట్లన్నిటితో పోల్చి చూస్తే, మన జట్టు అన్ని విభాగాల్లో పటిష్టం గా ఉంది. మరి, సీనియర్లు మార్చ్ నెల లో ఆంధిచిన ఆనందాన్ని జూనియర్లు సెప్టెంబర్ లో అందించగలరా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

16 minutes ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

36 minutes ago