సీబీఐని సునీత ప్రభావితం చేయగలిగితే… అవినాష్ కూడా చేయొచ్చుగా?

సునీతా రెడ్డి, వైఎస్ షర్మిల ఇద్దరూ వివేకా హత్య కేసు గురించి పదేపదే జగన్, అవినాష్ రెడ్డిలను నిలదీస్తుండటంతో, అవినాష్ రెడ్డి కూడా తన ఫోన్ రికార్డుల డేటాతో మీడియా ముందుకు వచ్చి వివేకా హత్య గురించి వివరించారు.

ADVERTISEMENT

ఈ హత్యతో తనకు ఎటువంటి సంబందమూ లేదని చెపుతూ, సునీతా రెడ్డిపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె సీబీఐతో కలిసి కుట్రలు చేసి ఈ కేసులో తనని ఇరికించేందుకు ప్రయత్నించారని అవినాష్ రెడ్డి వాదించారు.

ఈ హత్యతో తనకు ఎటువంటి సంబందమూ లేదని అవినాష్ రెడ్డి ఇంత ఖచ్చితంగా చెపుతున్నప్పుడు, మరి సీబీఐ విచారణను ఎదుర్కొని, న్యాయపోరాటం చేసి తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు కదా? కానీ ఆ ప్రయత్నం చేయకుండా బెయిల్‌ కోసమే ప్రయత్నిస్తున్నారు కదా?

అసలు ఈ కేసు 5 ఏళ్ళుగా ఎందుకు ముందుకు సాగకుండా మద్యలో చిల్లర పిటిషన్లు వేసి ఎందుకు అడ్డుకొంటున్నారు? నేరం చేయకపోతే త్వరగా ఈ కేసులో నుంచి బయటపడే ప్రయత్నం చేయొచ్చు కదా?

రాజకీయాలలో లేని సునీతా రెడ్డి సీబీఐని ఆడిస్తున్నారనే అవినాష్ రెడ్డి వాదనలు చాలా హాస్యస్పదంగా ఉన్నాయి. ఒకవేళ ఆమె సీబీఐని ప్రభావితం చేయగలిగితే అదేదో అవినాష్ రెడ్డే సీబీఐని ప్రభావితం చేసేసి కేసుని తనకు అనుకూలంగా తిప్పుకోవచ్చు కదా? చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, వీలైతే దగ్గుబాటి పురందేశ్వరిలను కూడా ఈ కేసులో ఇరికించేసి జైలుకి పంపించేయొచ్చు కదా?

జగన్‌ 5 ఏళ్ళ పాలనపై ప్రజలను తీర్పు కోరుతుంటే, అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసుపై కడప ప్రజల తీర్పు కోరుతుండటం హాస్యాస్పదంగా ఉంది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Karan Johar’s Koffee Exit with Shocking SRK-Aryan Twist

Koffee with Karan may be ending but Karan Johar is not ready to say goodbye…

34 minutes ago

Ranabaali US: Advance Sales & Breakeven Target No Sync

Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…

10 hours ago