Telugu

వివేకా హత్య కేసు విచారణ… ఇప్పట్లో ముగిసేది కాదు!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును శుక్రవారం హైదరాబాద్‌లో సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడి చంచల్‌గూడ జైలులో ఉన్న గంగి రెడ్డి, సునీల్ యాదవ్, ఉదయ శంకర్ రెడ్డి, దేవిరేడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసులో ఏ-8 నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో 145 పేజీలతో సీబీఐ మూడో ఛార్జ్ షీట్‌ వేసింది. ఈ కేసు తదుపరి విచారణని ఈ నెల 22కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించడంతో నిందితులు చంచల్‌గూడ జైలుకి, అవినాష్ రెడ్డి కడపకు తిరుగు ప్రయాణం అయ్యారు.

ADVERTISEMENT

ఈ కేసు విచారణ ఏపీలో చురుకుగా, పారదర్శకంగా సాగడంలేదనే కారణంతోనే సునీతా రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించి హైదరాబాద్‌కు మార్పించుకొన్నారు. అయితే తెలంగాణకు మారిన ఈ కేసు విచారణ వేగవంతం కాలేదు. ఈ కేసు విచారణను జూన్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించినప్పటికీ, నిందితులు చట్టపరమైన అవకాశాలను, లొసుగులను తెలివిగా ఉపయోగించుకొంటూ సుప్రీంకోర్టు చేతనే ఈ కేసు విచారణను వాయిదా వేయించుకొంటున్నారు.

తెలంగాణ సీబీఐ కోర్టులో నేడు 1వ తేదీ నుంచి 22కి తదుపరి విచారణ వాయిదా పడింది. అంటే దాదాపు నెలరోజులు కేసు పొడిగించబడిందన్న మాట. ఈ లెక్కన చూస్తే ఈ కేసు ఈ ఏడాదిలో పూర్తికాదని స్పష్టమవుతోంది. కనుక మరో ఏడాదో లేదా పదేళ్ళో సాగినా ఆశ్చర్యం లేదు.

మరోవిదంగా చెప్పుకోవాలంటే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయనే దానిని బట్టి ఈ కేసు విచారణ సాగుతుంది తప్ప కోర్టులను బట్టి కాదనే భావించవచ్చు.

ఓ హత్య కేసు విచారణను రాజకీయశక్తులు ఇంతగా ప్రభావితం చేస్తుండటం శోచనీయమే. రాజకీయ ఒత్తిళ్ళతో సీబీఐని కదలకుండా నిలబెట్టేస్తున్న నిందితులు, వారికి అండగా నిలుస్తున్న వైసీపీ ప్రభుత్వమే సీబీఐ విచారణను వేలెత్తిచూపుతూ విమర్శిస్తుండటం మరో విచిత్రం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bollywood Divided As Imran Khan Faces Exit Notice

Actor Imran Khan being asked to leave India has drawn mixed reactions from the film…

27 minutes ago

వైసీపీ సీనియర్లకు హ్యాండ్ ఇచ్చి చంద్రబాబుని వేలెత్తి చూపడమా?

స్థానిక సంస్థల ఎన్నికలలో సిఎం చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలకు హ్యాండ్ ఇచ్చారంటూ వైసీపీ సొంత మీడియా పుంఖానుపుంఖాలుగా కధనాలు ప్రచురిస్తూనే…

1 hour ago