Telugu

భాస్కర్ రెడ్డి, సీబీఐ అధికారులు వెయిటింగ్… ఎవరి కోసం ఎవరు?

వివేకానందరెడ్డి హత్యకేసు హైదరాబాద్‌కి బదిలీ అయినప్పటి నుంచి సీబీఐ విచారణ వేగవంతం అయ్యింది. ఈ కేసులో ప్రధాన నిండుతులలో ఒకరిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్‌కి పిలిపించుకొని శుక్రవారం మరోసారి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ప్రశ్నించాల్సి ఉంది. కానీ తనకు వేరే పనులున్నందున 24న విచారణకి హాజరుకాలేనని చెప్పడంతో సీబీఐ అధికారులు శనివారం ఉదయం కడప సెంట్రల్ జైలులో విచారణకి హాజరుకావాలని వాట్సప్ ద్వారా మెసేజ్ పంపారు.

కానీ తనకు సీబీఐ నుంచి ఎటువంటి నోటీస్ అందలేదని, అందితే విచారణకి సిద్దంగా ఉన్నానని భాస్కర్ రెడ్డి చెప్పారు. అయితే సీబీఐ అధికారులు ఈరోజు ఉదయం కడప చేరుకొని అక్కడ హరితా రిసార్టులో బస చేసి ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. వారు ఆయన కోసం ఎదురుచూస్తుంటే, ఆయన వారి పిలుపు కోసం ఎదురుచూస్తున్నానని చెప్పడం విశేషం. తాజా సమాచారం ప్రకారం సీబీఐ అధికారులు రిసార్టులో, భాస్కర్ రెడ్డి తన ఇంట్లో ఒకరికోసం మరొకరు ఎదుచూస్తూ కూర్చోన్నారని తెలుస్తోంది.

ADVERTISEMENT

ఇంతకీ సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని ప్రశ్నించేందుకే కడపకి వచ్చారా లేదా ఈ కేసుకి మరెవరినైనా అరెస్ట్ చేసేందుకు వచ్చారా? అనే విషయం ఈరోజు సాయంత్రంలోగా తెలుస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pawan Kalyan Faces Backlash Over Alliance Seat Sharing

The TDP, despite being the ruling party in Andhra Pradesh, has agreed to share a…

10 minutes ago

India ODI & Test Squads for NZ Tour: Who’s In, Who’s Out?

The Indian selection committee has announced the Test and ODI squads for the upcoming tour…

30 minutes ago