
సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీ సభలో ఆరోగ్యశ్రీ పధకం గురించి గొప్పగా చెప్పుకొంటుంటారు. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు బకాయిలు చెల్లించడంలేదని, ఇకనైనా బకాయిలు చెల్లించాలంటూ వాటి మొరని జగన్ ఆలకించడం లేదట! ఈ విషయం ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆషా) స్వయంగా ధృవీకరించింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి తిరుమల కృష్ణ బాబుకి ఈనెల 13వ తేదీన వ్రాసిన లేఖలో ముఖ్యాంశాలు:
ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు బకాయిలు చెల్లించవలసి ఉంది. గత 45 రోజుల బిల్లులు కాకుండా చెల్లించాల్సిన బకాయిలు ఇవి.
ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని మేము ఎన్ని లేఖలు వ్రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. స్పందించడం లేదు.
అలాగే నానాటికీ పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశ్రీ సేవలకు ఛార్జీలను పెంచాలనే మా విన్నపాలను ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఆరోగ్యశ్రీ పధకం కింద వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కానీ వారికి సేవలందించినందుకు ప్రభుత్వం మా బకాయిలను ఒప్పందం ప్రకారం ఆరునెలలోగా చెల్లించడం లేదు.
మేము ఈ సమస్యలన్నిటినీ ఎప్పటికప్పుడు లేఖల ద్వారా మీకు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారి దృష్టికి తీసుకువస్తూనే ఉన్నాము. కానీ మీవైపు నుంచి స్పందన రాకపోవడం బాధాకరం.
కనుక తక్షణం పూర్తి బకాయిలను చెల్లించవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము. లేకుంటే ఇకపై మేము ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించలేమని ఇందుమూలంగా తెలియజేస్తున్నాము,” అని ఆషా అధ్యక్షుడు డాక్టర్ వి. మురళీ కృష్ణ సంతకం చేసి పంపారు.
వైసీపి ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్నా అప్పులు చేసి మరీ సంక్షేమ పధకాలను అమలుచేస్తూనే ఉంది. అయితే వాటినీ సవ్యంగా అమలుచేయలేకపోతోందని ఈ తాజా లేఖ ద్వారా స్పష్టమవుతోంది.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…