పెళ్ళలా నుండి ఇల్లాలుకు వచ్చారు? ఆడవారితోనేనా మీ రాజకీయం?

గతంలో పార్టీ కార్యక్రమాలు – ప్రభుత్వ కార్యక్రమాలు అంటూ రెండు వేరు వేరు ధోరణిలో జరుగుతూ ఉండేవి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. పార్టీయే ప్రభుత్వం ప్రభుత్వమే పార్టీ అయ్యిపోయింది. ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించే సభలలో ప్రభుత్వ విది విధానాలను చెప్పడం ప్రతిపక్షాల విమర్శలకు ప్రజలలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం ముఖ్యమంత్రి కర్తవ్యంగా ఉండేది.

అధికార ప్రతిపక్ష నేతల మధ్య విమర్శ – ప్రతి విమర్శ సహజమే. కానీ ఆంధ్రప్రదేశ్ దోర్భగ్యం ఏమిటో కానీ రాజకీయాలతో సంబంధం లేని ప్రతిపక్ష కుటుంబంలో ఆడవారిని సైతం వైసీపీ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి జగనే జనసేన అధినేత పవన్ భార్యల పై ప్రతి బహిరంగ సభలోను ప్రస్తావించడం ఆయన పదవికే అగౌరవం తెస్తుంది అనే కనీస స్పృహ లేకుండా చేస్తున్న విమర్శలు రాష్ట్ర రాజకీయాలను తలదించుకునేలా చేస్తున్నాయి.

ADVERTISEMENT

తోటి ప్రతిపక్ష నేతను పేరు పెట్టి కూడా పిలవలేని జగన్ కుసంస్కారం గురించి అనేక వేదికలలో పవన్ ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబుకి ఒక దత్తపుతుడు అతనికి ముగ్గురో నలుగురో పెళ్ళాలు,వారికి నలుగురు పిల్లలు అంటూ ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని ప్రభుత్వ సభలలో రాజకీయ విమర్శలకు ఉపయోగించుకునే స్థాయికి ముఖ్యమంత్రి పదవిని దిగజార్చిన ఘనత వైస్.జగన్ కే దక్కుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఒక వ్యక్తితో విడాకులు తీసుకున్న మహిళను మరల అదే వ్యక్తికి భార్యగా సంబోధించడం కూడా చట్టరీత్యా నేరమే అవుతుంది. గతంలో అమ్మఒడి పథకానికి బటన్ నొక్కినప్పుడు కూడా జగన్ పవన్ పెళ్లిళ్ల గురించి పెళ్ళాలా గురించి మాట్లాడం పలు విమర్శలకు దారితీసింది. పిల్లల సభలో కూడా పెళ్ళలేనా? నీకు మీ తల్లితండ్రులు నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ పవన్ విరుచుకు పడడంతో కాస్త తగ్గినా జగన్ ఇప్పుడు మరో కొత్త పదం ఇల్లాలుతో వచ్చి మళ్ళి ఆడవారితోనే రాజకీయం మొదలుపెట్టారు.

దత్తపుత్రుడికి పక్క రాష్ట్రంలో ఒక ఇల్లు మూడేళ్లకు ఒక ఇల్లాలు ఒకరు లోకల్, మరొకరు నేషనల్, ఇంకొకరు ఇంటర్ నేషనల్, ఇంకా ఎక్కడికి పోతాడో అంటూ పవన్ వ్యక్తిగత జీవితాన్ని కొత్తగా వైసీపీ ప్రభుత్వ విచారణ జరిపి ఆధారాలతో ప్రజల ముందు ఉంచినట్టుగా చెప్పడం పవన్ చెప్పినట్లు జగన్ మానసిక అనారోగ్యానికి నిదర్శనమనే అనే భావించాలేమో.

పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయం కొత్తగా ఎవరో చెప్పాల్సిన పని లేదు. అనేక బహిరంగ వేదికల మీద స్వయంగా ఆయనే కొన్ని వ్యక్తిగత కారణాలతో మేము విడిపోవడం జరిగింది ఇది తన తలా రాత మార్చలేము అంతే అంటూ వ్యాఖ్యానించారు. వైస్సార్ కుటుంబంలో కూడా వివాహాల పంచాయితీలు చాలానే ఉన్నాయి అంటూ వైసీపీ ఎంపీ RRR ఎన్నో సందర్భాలలో మీడియా ముఖంగా విమర్శించారు.

తన కుటుంబ చరిత్ర కూడా జగన్ ఒక్కసారి తెలుసుకుంటే ఇటువంటి విమర్శలకు తావుండదు అనేది జనసేన వాదం. ఒక్క పవన్ విషయంలోనే కాదు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి విషయంలోనూ, లోకేష్ భార్య బ్రాహ్మణి విషయంలోనూ జగన్ ప్రభుత్వానిది ఇదే వైఖరి.

ప్రతిపక్ష పార్టీ అధినేతల ఆడవారిపైనే ఇటువంటి విమర్శలు చేస్తుంటే ఇక ఆపార్టీ మహిళా నేతల మీద ఆ పార్టీ మహిళా కార్యకర్తల మీద వైసీపీ సోషల్ మీడియా చేసే వికృత చేష్టలకు అడ్డుఅదుపు లేదనే చెప్పాలి. సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే బహిరంగం సభలలో ప్రతిపక్ష నేతల భార్యలను రోడ్డు మీదకు తీసుకువచ్చి రాజకీయ విమర్శలకు బాటలు వేస్తే ఇక ఆ పార్టీ కింద స్థాయి నేతలు ఇంకెంత దిగజారుడు విమర్శలు చేస్తారో ప్రజలు కూడా ఆలోచించాలి.

ఆడవారి పై రాచరిక చూపిస్తే వారి పరిస్థితి ఏమిటో పురాణాలూ తిరగేస్తే అయినా జగన్ కు అర్ధమవుతుందేమో! ఆడవారి పై తప్పుడు విమర్శలు చేస్తే వారు రాజయినా, పాతాళంలో దాక్కున్నా కర్మ వదిలిపెట్టదు అనేదానికి చరిత్ర ఎన్నో సాక్ష్యాలనే మిగిల్చింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Vijay-Modi’s Metro Ride Turns Generational Meme Content?

Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…

12 minutes ago

Vijay Deverakonda vs Rajni: Can Ranabaali Make It 3-0?

Vijay Deverakonda has an interesting history at the box office with Rajinikanth. On two previous…

42 minutes ago