హైకోర్టు తరలింపుపై జగన్ ప్రభుత్వం మొదటి సంకేతం

YS Jagan - Amaravati- High Court Shiftingఅమరావతి విషయంలో ఎటూ తేల్చని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకంటే ముందే అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో కొన్ని కీలక మార్పులు చెయ్యదల్చింది. ఇందులో భాగంగా హై కోర్టును రాయలసీమకు తరలించాలని చూస్తున్నట్టు సమాచారం. దీని గురించి మొదటి సంకేతం ఇచ్చింది ప్రభుత్వం. రాయలసీమలో హైకోర్టు అంశం పరిశీలనలో ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

ADVERTISEMENT

అభివృద్ధి వికేంద్రీకరణ చాలా అవసరమని, 13 జిల్లాల్లో సమాన అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే తమ ప్రాంతానికి అంటే తమ ప్రాంతానికి అని వివిధ ప్రాంతాల లాయర్లు హైకోర్టు కోసం పోరాడుతున్నారు. రాజధాని ప్రాంత లాయర్లు మాత్రం హైకోర్టు ఇక్కడే ఉండాలని నిరసనలు చేస్తున్నారు. హైకోర్టు తరలింపు జరిగితే మాత్రం అమరావతి మారడం కూడా దాదాపుగా ఖరారు అయినట్టే.

ఇది ఇలా ఉండగా అమరావతి పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసులో ఏముందో చెప్పడం లేదు. ఆ ప్రశ్న వస్తుందనే ముఖ్యమంత్రి మీడియాతో కూడా మాట్లాడటం లేదు. మంత్రులు మాత్రం ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మీడియా ముందు మాట్లాడుతూ అయోమయానికి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అయోమయంగా ఉన్నారు. తమ ఫ్యూచర్ ఏమిటి అనేది వారికి అంతుచిక్కకుండా ఉంది. అమరావతి కోసం దాదాపుగా 25000 మంది రైతులు 33000 ఎకరాలు అప్పటి ప్రభుత్వానికి స్వచ్చంధంగా ఇచ్చారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆ ప్రాంతంలో ఇటుకన్నది పడలేదు. భూముల రేట్లు అమాంతం పడిపోయాయి.

ADVERTISEMENT
Latest Stories