
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే ఏం చేస్తారు? ముందు హెచ్చరిస్తారు. అప్పటికీ చెల్లించకపోతే తాకట్టులో ఉన్న బంగారం లేదా ఆస్తిని జప్తు చేస్తారు.
ఈ ప్రకారం చూస్తే ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1,500 కోట్లు చెల్లించనందుకు వైద్య సేవలు నిలిపివేస్తామని సదరు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు, ప్రభుత్వం వెంటనే బకాయిలు తీర్చి వైద్య సేవలు కొనసాగేలా చేయాలి.
కానీ జగన్ ప్రభుత్వం మొదటి నుంచే అంతా రివర్స్. సదరు ఆసుపత్రులకు బకాయిలు చెల్లించలేక వైద్య సేవలు నిలిచిపోయినందుకు సిగ్గుపడకకపోగా, ‘రాజకీయాలకు అతీతంగా ఏపీలో జగనన్న పాలన’ అంటూ సోషల్ మీడియాలో జగన్ ఫోటోతో ఓ సందేశం పెట్టింది. ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేసే ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశామని దాని సారాంశం.
మరో 10 రోజులు మాత్రమే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కనుక ఆసుపత్రులకు తక్షణమే బకాయిలు చెల్లించి పేదలకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు కొనసాగేలా చేయకపోగా దిగిపోయే ముందు కూడా ఆసుపత్రి యాజమాన్యాలను ఈవిదంగా బెదిరించడం, మళ్ళీ ఈ విషయాన్ని గొప్పగా సోషల్ మీడియాలో చాటుకోవడం సిగ్గుచేటు.
ఒకవేళ ఆసుపత్రుల అసోసియేషన్ కోర్టుని ఆశ్రయిస్తే మొట్టికాయలు పడేది తమకే అని వైసీపి మేధావులు మరిచిన్నట్లున్నారు. అయినా అధికారంలో నుంచి దిగిపోయే ముందు కూడా మరో అవమానం అవసరమా? అని ఆలోచిస్తే ఈవిదంగా చేసి ఉండరు. కానీ పుట్టుకతో వచ్చిన గుణాలు పుడకలతో కానీ పోవంటారు… అంటే ఇదేనేమో?
Rajinikanth is going to return to the big screen tomorrow with his new film Jailer…
స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా…