రాజకీయమా? రాక్షసత్వమా?

అధికార పక్షమైన, ప్రతి పక్షమైన జగన్ చేసే రాజకీయంలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. వైసీపీ రాజకీయ జీవితమే శవ రాజకీయాలతో మొదలయ్యింది. తండ్రి మరణాన్ని అడ్డుపెట్టుకుని ఓదార్పు యాత్ర అంటూ మొదలైన జగన్ రాజకీయ యాత్ర ఇప్పటికి అదే పంధాలో కొనసాగుతూ వస్తుంది.

గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీయడానికి వైజాగ్ కోడికత్తి సంఘటన నుంచి వివేకా దారుణ హత్య వరకు ఎంత రాజకీయం చెయ్యాలో అంతా చేసి రాష్ట్ర పరువును ఢిల్లీ విధులలో పెట్టారు జగన్.

ADVERTISEMENT

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిపోయిందని, బాబు పాలనలో ఏపీలో అరాచకం రాజ్యమేలుతున్నాయని ఢిల్లీ నుంచి గల్లీ దాక తనకున్న మీడియా సహకారంతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీశారు.

ఇక 2019 ఎన్నికలలో అధికారాన్ని అందిపుచ్చుకున్న జగన్ ఇకనైనా తన పంధా మార్చుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తారు అనుకున్న వారందరికీ అసలు తన రాజకీయం ఇది అన్నట్టుగా కూల్చివేతలతో పాలన మొదలుపెట్టి విధ్వంసంతో ముగించారు.

గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను ఎదిరించే సాహసం చెయ్యలేక రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామిక వేత్తలు ఒక్కొక్కరుగా ఏపీకి దండం పెట్టి పొరుగు రాష్ట్రాలకు పరుగులెత్తారు.

అధికారంలోకి వచ్చింది రాష్ట్ర విధ్వంసానికే అన్నట్టుగా గతంలో మునుపెన్నడూ చూడని, ఏపీ రాజకీయ చరిత్రలో కనివిని ఎరుగని కక్ష్య సాధింపు చర్యలకు భీజం వేశారు జగన్. మన పక్షమైతే ప్రాణం తీసినా పర్లేదు, ప్రత్యర్థి పక్షమైతే ప్రశ్నించినా ప్రాణం తీసేయండి అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లల్లో రాష్ట్రానికి ఓ కొత్త సంప్రదాయాన్ని పరిచయం చేసారు.

ప్రశ్నిస్తే కేసులు, నిందిస్తే అరెస్టులు, ఎదురు తిరిగితే వైసీపీ ట్రీట్మెంట్ అంటూ ముందుకెళ్లిన జగన్, మాస్క్ లేదన్న పాపానికి డా. సుధాకర్ అనే సామాన్యుడి నుండి సొంత పార్టీ ఎంపీ RRR వరకు ఒకటే ట్రీట్మెంట్ ఇచ్చి తన ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ను ఏపీ రాజకీయాలకు పరిచయం చేసారు.

వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో మొదలైన ఈ విష సంస్కృతీ కి భయపడి ఎన్నో పరిశ్రమలు రాష్ట్రం దాటిపోయాయి. మరెన్నో కొత్త పరిశ్రమలు ఏపీ వైపు చూడడానికి కూడా సాహసించలేదు. వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మి ఐటీ మంత్రిగా పని చేసిన గుడివాడ అమర్నాధ్ ను చూసి కనీసం ఒక కోళ్ల పరిశ్రమ నిర్మించడానికి కూడా ఎవ్వరు ముందుకు రాలేదు అంటే అది అతిశయోక్తి కాదు.

జగన్ ధోరణితో రాష్ట్ర భవిష్యత్ కు జరుగుతున్న నష్టాన్ని అర్ధం చేసుకున్న నేటి యువత తిరిగి రాష్ట్ర పునర్నిర్మాణానికి తమ ఓటు అనే ఆయుధాన్ని వాడి వైసీపీ ని గద్దెదింపి కూటమి కి మద్దతు పలికారు. ముఖ్యమంత్రి స్థాయి నుండి సాధారణ ఎమ్మెల్యే స్థాయికి జగన్ రాజకీయ జీవితాన్ని తీసుకువచ్చినా జగన్ మాత్రం ఏపీ పై తన రక్షత్వాన్ని వదలడం లేదు.

కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పురాతయ్యిందో లేదో అప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పిపోయాయంటూ, రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఏర్పడిందంటూ నానా యాగీ చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అరాచకాన్ని రాష్ట్ర ప్రతిష్టకు ముడి పెట్టి జగన్ చేస్తున్న రాజకీయం చూస్తుంటే ఇది రాజకీయమా? రాక్షసత్వమా? అనక మానరు.

తనకున్న బ్రాండ్ ఇమేజ్ ను, రాజకీయ అనుభవాన్ని రాష్ట్రానికి పెట్టుబడిగా పెట్టి తిరిగి ఏపీని గాడిన పెట్టడానికి ఆరు పదుల వయస్సులోనూ బాబు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. సైబరాబాద్ వంటి మహా నగరాన్ని నిర్మించిన అనుభవంతో అమరావతిని ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టుగా నిర్మించడానికి, నూతన పెట్టుబడులు పెట్టడానికి భారీ పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు బాబు.

ఇటువంటి తరుణంలో జగన్ మళ్ళీ తన రాక్షస రాజకీయాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఎదో జరిగిపోతున్నదని, ఏపీలో ఎవ్వరికి భద్రత లేదు అనే వాతావరణాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి ఢిల్లీలో రాజకీయం చేయడానికి సిద్ధమయ్యారు జగన్.

ఈ విధంగా మరో సారి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసి ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయడానికి జగన్ తన దగ్గరున్న అన్ని వ్యూహాలను అమలు చేస్తున్నారు. తన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే అది కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు కు అది ప్రజలలో పెద్దఎత్తున రాజకీయ మైలేజ్ ను తెచ్చిపెట్టడంతో పాటు వైసీపీ కి జగన్ కు ఎదురుదెబ్బగా మారుతుంది.

తనకు దక్కంది ఎవరికీ దక్కకూడదు అనే మనస్తత్వం ఉన్న జగన్ కేవలం తన రాజకీయ లబ్ది కోసం 5 కోట్ల ప్రజల భవిష్యత్ ను రాష్ట్ర ప్రతిష్టను బలిపీఠం ఎక్కించడానికి కూడా సంశయించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాలు ఆమధ్య సాగుతున్న ఈ రాజకీయ వైరంలో నలిగిపోతుంది సామాన్య కార్యకర్తలు, సాధారణ ప్రజలు.

రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం ముగిసినా ఏపీ ఇంకా గాడినపడలేదు అంటే ఆ పాపం ఎవ్వరిది? 175 కు 164 సీట్లు సాధించి దేశ చరిత్రలోనే ప్రతిపక్షం కూడా లేని బలమైన ప్రభుత్వం గా నిలిచినా టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేయలేక జగన్ రాజకీయ పద్మవ్యూహంలో ఏపీని బలిపశువును చేస్తుందా?

రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసేలా జగన్ చేస్తున్న రాజకీయానికి బాబు ఫుల్ స్టాప్ పెట్టలేకపోతే ప్రజలిచ్చిన ప్రజాతీర్పును అవమానించినట్టే అవుతుంది. మంచి గడప దాటాక ముందే చెడు చెప్పులేసుకుని ఊరంతా ప్రచారం చేసి వస్తుంది అనే సామెతను బాబు దృష్టిలో పెట్టుకుని వైసీపీ నోటికి జగన్ ఆలోచనలకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చేసింది.

గత ఐదేళ్లలో ఏపీ ప్రజలు చూడని అభివృద్ధిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తే అది జగన్ రాజకీయ భవిష్యత్ కు చావు దెబ్బ అవుతుంది, కాబట్టి జగన్ కు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి కాదు రాష్ట్ర విధ్వంసం. ఇప్పుడు జగన్ వేసే రాజకీయ అడుగుల వ్యూహం ఇదే కావచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

CJP Protests: Is Abhijeet Dipke Justified in Insulting PM Modi?

The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…

11 seconds ago

Sukumar’s Ram Charan RC17 Film: Anirudh Replaces DSP?

Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…

30 minutes ago