
రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబుని తరలించేటప్పుడు కూడా ఇదే అత్యుత్సహం ప్రదర్శించారు సదరు సాక్షులు. జైలు ప్రధాన గేట్ ఆవరణానికి 20మీటర్ల దూరంలోనే మీడియా వాహనాలను నిలిపివేశారు జైలు అధికారులు. జైలు రెండో గేట్ లో రిమాండ్ ఖైదీలకు తప్ప విలేకరులకు., ఇతర సిబ్బందికి అనుమతి ఉండదు.
జైలు రెండవ గేట్ ప్రాంగణంలో కెమెరాలకు.,సెల్ ఫోన్ లకు., వీడియోల చిత్రీకరణకు అనుమతి నిషిద్ధం. అటువంటి ప్రదేశంలో చంద్రబాబు జైలులో అడుగుపెడుతున్న దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయి అనేది ఆ సాక్షినే చెప్పాలి. వైసీపీ మద్దతుదారులు ఆయా పిక్స్ లను సోషల్ మీడియా వేదికా షేర్ చేయడం ఇప్పుడు అందరి వేళ్ళు ప్రభుత్వం చూపుతున్నాయి.
జగన్ మోహన్ రెడ్డికి ఇదేమి కొత్తకాదు. గతంలో కూడా సినిమా టిక్కెట్లు వివాదానికి అగ్రహీరోలందరిని చర్చలు అంటూ తాడేపల్లి ప్యాలస్ కు పిలిపించుకుని రోడ్ బయటనే వారి వాహనాలను ఆపి వారందరిని తన ఇంటి గేట్ వరకు నడిపించిన వీడియోలను.., చిరంజీవి చేతులు జోడించి జగన్ ను అభ్యర్థిస్తున్న వీడియోలను లీక్ చేసి ఆయా హీరో ల ఫాన్స్ ను రెచ్చగొట్టి పైశాచిక ఆనందం పొందారు సదరు ముఖ్యమంత్రి వర్యులు.
ఇపుడు అదే పంధాలో ముందుకు వెళ్తున్నారు జగన్ అండ్ కో. జైల్లోకి వెళ్ళడానికి కొద్దీ గంటల ముందే బాబు కి కేటాయించి ఆర్సీ నెంబర్ కూడా సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొట్టడం కూసంత ఆశ్చర్యానికి గురిచేసినప్పటికీ వెంటనే తేరుకొని ఇంతంత జగన్ మాయ అంటూ వాస్తవంలో రావడం ప్రజల వంతయింది. ప్రభుత్వానికి అరెస్ట్ తో సంబంధం లేకపోతే ఈ లీకులన్నీ ఎక్కడి నుంచే వచ్చాయో వారే సెలవివ్వాలి.
అత్యంత గోప్యంగా ఉండాల్సిన విషయాలు ఇలా లీకుల ద్వారా బయటకు వస్తే వాటి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలాకాకుండా ప్రభుత్వ పెద్దలే చోద్యం చూస్తున్నట్లు వాటిని ప్రోత్సహిస్తుంటేనే అర్ధమవుతుంది కెమెరాకు చిక్కింది బాబు కాదని ప్రభుత్వమే అని.
Actor Imran Khan being asked to leave India has drawn mixed reactions from the film…
స్థానిక సంస్థల ఎన్నికలలో సిఎం చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలకు హ్యాండ్ ఇచ్చారంటూ వైసీపీ సొంత మీడియా పుంఖానుపుంఖాలుగా కధనాలు ప్రచురిస్తూనే…