2024 వచ్చినా ఇంకా 2014 దగ్గరే జగన్ ‘వై’..?

జగన్ ఎన్నికల ప్రచారం గమనిస్తుంటే ఆయన 2014 నుండి ఎందుకో బయటకు రాలేకపోతున్నారా అనే భావన కలుగుతుంది. జగన్ చోడవరం వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ 2014 నాటి టీడీపీ మేనిఫెస్టో పట్టుకుని రాజకీయ విమర్శలు చేస్తున్నారు. 2014 తరువాత 2019 లో ఒకసారి ఇప్పుడు 2024 లో మరోసారి ఏపీకి రెండుసార్లు ఎన్నికలు వచ్చినా జగన్ మాత్రం ఆ 2014 నుంచి బయట పడలేకపోతున్నట్లు ఉన్నారు.

ADVERTISEMENT

2014 లో టీడీపీ ఇచ్చిన మానిఫెస్టోలో అంశాలు అమలు చేయలేకపోయింది అంటూ విమర్శిస్తున్న జగన్ అమలు చేయలేకపోయింది కాబట్టే వైసీపీ కి ఛాన్స్ వచ్చింది అనే అంశాన్ని నమ్మలేకపోతున్నారా.? ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణం, జాబ్ కాలెండర్, మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు వంటి హామీలతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన జగన్ ఈ పథకాలకు, ఇచ్చిన హామీలకు ఎందుకు గోవింద కొట్టారో చెప్పగలరా..? వైసీపీ తానూ ఇచ్చిన హామీలను అమలు చేయలేక, వాటికీ సమాధానము చెప్పలేక 2014 నాటి టీడీపీ మేనిఫెస్టో పెట్టుకుని మరో ఛాన్స్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

2019 లో వైసీపీ ఇచ్చిన మానిఫెస్టోలో అన్ని అంశాలు అమలు చేసినట్లయితే 2014 టీడీపీ మేనిఫెస్టో తో జగన్ కు పనేంటి..? దానికి తమ తీర్పుతో ప్రజలు ఎప్పుడో సమాధానం చెప్పేసారు కూడా. సమాధానము రాసిన ప్రశ్నే పదేపదే అడుగుతున్నారు అంటే ఇంకా ప్రశ్నించాడనికి ఏమి లేవనేనా..? లేక సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు వారికి ఎదురవుతున్నాయా..? ఈ రెండితో వైసీపీ దేనితో ఇబ్బంది పడుతుందనేది ఇప్పటికే ప్రజలకు స్పష్టమయినప్పటికీ వైసీపీ నేతలు గ్రహించలేకపోతున్నారనే విమర్శలు మొదలయ్యాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Ranabaali US: Advance Sales & Breakeven Target No Sync

Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…

5 hours ago

AK47 New Date: Trivikram About to Break His Promise?

After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…

6 hours ago