Telugu

సింగిల్ సింహానికి తోడు దొరికినట్లేనా?

సింగిల్ సింహం.. అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక సింగిల్ కాదు వామపక్షాలతో మింగిల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ఈ నెల 26న విజయవాడలో నిర్వహించబోయే రౌండ్ టేబిల్ సమావేశానికి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.

ADVERTISEMENT

సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిన్న తాడేపల్లి ప్యాలస్‌లో జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు వైసీపీ ఎల్లప్పుడూ సిద్దంగానే ఉంటుందని జగన్‌ వారికి చెప్పినట్లు తెలుస్తోంది.

టీడీపి, జనసేనలకు తనని ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేకనే పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తున్నాయని జగన్‌ ఎద్దేవా చేస్తుంటారు. అయితే ఎంత సింహమైనా సింగిల్‌గా యుద్ధాలు చేస్తే ఓటమి తప్పదని జగన్‌ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.

కానీ వైసీపీతో పొత్తులు పెట్టుకునేందుకు రాష్ట్రంలో ఏ పార్టీ ముందుకు రాలేదు. కనుక తన నిసహాయతకు ‘సింగిల్ సింహం’ అనే గంభీరమైన ముసుగు వేసుకోక తప్పడం లేదు.

కానీ తొలిసారిగా సీపీఐ నేతలు వచ్చి ఈ ఆఫర్ ఇచ్చారు. ఈ సమావేశానికి కరువు పరిస్థితిపై చర్చ, ప్రజా సమస్యల చర్చలనే అందమైన ముసుగు వేసినప్పటికీ, ఇది రాష్ట్ర స్థాయిలో పొత్తులకు, కుదిరితే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి వైపు తీసుకువెళ్ళవచ్చు.

వచ్చే ఎన్నికలలో కూడా మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని మూడు పార్టీల అధినేతలు పదేపదే చెపుతున్నారు కూడా. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తుండటం ద్వారా కేంద్రం కూడా ఇదే సూచిస్తోంది.

ముఖ్యంగా కూటమిలో నుంచి జనసేనను బయటకు లాగి బలహీన పరచాలని ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. వాటి బంధం ఎలాస్టిక్‌లా సాగుతోందే తప్ప ఎంతకీ తెగడం లేదు.

కనుక కాస్త విలనిజం చేసైనా సరే ప్రజలను, అధికారులను జగన్‌ తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయ సన్యాసం అంటూ వెళ్ళిపోయిన పెద్ద మనిషి విజయసాయి రెడ్డి, ఏడాది తిరగ్గానే ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు తిరిగివచ్చి త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు.

కనుక తాడేపల్లి ప్యాలస్‌ని శత్రువులు చుట్టుముడుతుంటే, సింగిల్‌ సింహం ఎవరో ఒకరితో మింగిల్ కాక తప్పదు. కనుక సింగిల్ సింహానికి సీపీఐ తోడు దొరకడం శుభపరిణామమే.

కానీ జగన్‌ సీపీఐ చెయ్యి పట్టుకొని విజయవాడ వరకే వెళ్తారా? వచ్చే ఎన్నికలకు వెళ్తారా? లేక ఇండియా కూటమి వరకు వెళ్తారా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Iran Made A Balayya Mistake, Then Fixed The Tone!

Balakrishna has somehow found himself at the centre of a rather unexpected international cinema moment.…

24 minutes ago

The Paradise Impact: Is Nag Ashwin Feeling the Pressure?

The mixed response to Nani’s The Paradise has triggered a bigger discussion in the Telugu…

54 minutes ago