అన్యాయం జరిగితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చా.?

జగన్ మీడియా ముందుకు రావడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తారో, ఎందుకు వెనకడుగు వేస్తారో జగన్ చేసే వ్యాఖ్యలు పరిశీలిస్తే అర్ధమవుతుంది. పిన్నెల్లి పరామర్శకు వచ్చిన జగన్ మీడియా కంటికి చిక్కారు. అయితే మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేను కానీ తానూ చెప్పాలనుకున్న మూడు ముక్కలు చెప్పి వెళ్ళిపోతా అన్నట్టుగా కొన్ని విషయాలను పంచుకున్నారు.

ADVERTISEMENT

పిన్నేల్లిని అన్యాయంగా అరెస్టు చేసారని, ఈవీఎం లను ధ్వంసం చేయడం పెద్ద నేరమేమి కాదని, అక్కడ అన్యాయం జరుగుతుందని, అక్కడ ఆ ఎమ్మెల్యే పరిస్థితే బాగుంటే ఈవీఎం లను ఎందుకు బద్దలు కొడతాడు.? అక్కడా పరిస్థితి లేదు కాబట్టి పిన్నెల్లి ఈవీఎం లను పగలకొట్టారని, అన్యాయాన్ని ఎదిరించడం తప్పా అంటూ జగన్ రాజ్యాంగాన్నే ఎదురు ప్రశ్న వేస్తున్నారు.

ఈవీఎం లను బద్దలు కొట్టడం అంటే ప్రజా తీర్పును అవమానించడమే అవుతుంది. అసలు పిన్నెల్లి అరాచకాలు ఈవీఎం ధ్వంసంతో ఆగిపోలేదు. అక్కడ ఉన్న టీడీపీ ఏజెంట్ మీద కు దాడికి వెళ్లడం ఆయన మీద హత్య ప్రయత్నం చెయ్యడం అన్ని వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయి. ఈవీఎం లను పగలకొట్టిన కేసులో పిన్నేల్లికి బెయిలు వచ్చింది కాబట్టి ఇంకా పిన్నెల్లి మీద ఎన్ని కేసులు ఉన్న బయటకు పంపాలి అనే విధంగా జగన్ వ్యాఖ్యానించడం చట్టాల పై తనకున్న అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయి.

కాసేపు జగన్ వాదనే నిజమని భావించిన అన్యాయం జరిగితే వైసీపీ నాయకులే చట్టాలను చేతిలోకి తీసుకుని ఇలా విధ్వంసాలు చేయాలా.? ఇదేనా వైసీపీ లా.? అలా అయితే ఎవరికీ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వైసీపీ నాయకుల మాదిరి వారే చట్టాన్ని చేతిలోకి తీసుకుని వారే న్యాయం చేసుకోవాలా.? ఇక ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు పని లేదని జగన్ చెప్పాలనుకుంటున్నారా.?

అన్యాయం జరిగింది పగలుకొడతాం, బీపీలు వచ్చాయి విరగొడతాం, చెప్పిన మాట వినలేదు చావకొడతాం, మాకు అనుకూలంగా స్పందించలేదు బూతులు తిడతాం అంటూ ఇంకా అదే ముర్కత్వంతో జగన్ వ్యవహరిస్తే జగన్ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అసలు జగన్ మొదలుకుని రాజకీయ నాయకులు ఎవరైనా భద్రత లేకుండా బయట తిరిగే పరిస్థితి ఉంటుందా.?

ఒకరికి న్యాయమనిపించింది మరొకరికి అన్యాయమనిపించే అవకాశం కచ్చితంగా ఉంటుంది. అప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమవుతుంది.? ఇలా అవగాహన లేకుండా మాట్లాడడం వల్లనే జగన్ సోషల్ మీడియాలో ఎప్పుడు టార్గెట్ అవుతుంటారు. అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నాసేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఇలా చట్టాలను అతిక్రమించి ప్రవర్తించాలి అని బహిరంగంగా తన మద్దతుదారులకు చెప్పిన ఒకేఒక్క రాజకీయ నాయకుడు జగన్ మాత్రమే అనేది చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Forget Reels, Focus on Real Life: Suriya

Actor Suriya has a message for students who spend too much time making reels, focus…

32 minutes ago

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీట్ల కోసం పట్టుబడితే ఎలా?

స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన 40 శాతం సీట్లకు పట్టుబడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్…

35 minutes ago