
జగన్ తాను ‘సూపర్ మ్యాన్’ కనుకనే ప్రజలు తనను ఎన్నుకుని ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని భావించేవారు. కనుక 5 ఏళ్ళ పాలనలో ప్రతీ రంగాన్ని సంస్కరించి, ప్రక్షాళన చేసి అద్భుతంగా తీర్చిదిద్దగల నేర్పు, తెలివితేటలు తనకు మాత్రమే ఉన్నాయని గట్టిగా నమ్మేవారు. అందుకే పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యావ్యవస్థను సంస్కరణల పేరుతో అనేక ప్రయోగాలు చేస్తూ పూర్తిగా భ్రష్టు పట్టించేశారు.
ముఖ్యంగా పాఠశాల చేసిన అనేక ప్రయోగాలతో విద్యార్దులు, విద్యావ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. పాఠశాల స్థాయిలో విద్యార్ధులకు బలమైన పునాది పడాల్సి ఉండగా, ‘జగన్ మావయ్య’ రాజకీయాలు జొప్పించారు.
అత్యున్నత విద్యా ప్రమాణాలకు నిలయాలుగా నిలవాల్సిన యూనివర్సిటీలలోకి కులం, రాజకీయాలను జొప్పించి ఎంత భ్రష్టు పట్టించారో రోజూ వార్తలలో చూస్తున్నాము.
కనుక ప్రాధమిక స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు వ్యాపించిన ఈ ‘జగన్ వైరస్’ను పూర్తిగా తొలగించి, మళ్ళీ విద్యావ్యవస్థను గాడిన పెట్టాల్సిన బాధ్యత సిఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పైనే ఉంది.
తాజాగా మంత్రి టిజి భరత్ కర్నూలు జిల్లాలో పాఠశాలలను సందర్శించి, గత 5 ఏళ్ళలో జగన్ చేసిన ప్రయోగాలతో పాఠశాల స్థాయి విద్యావ్యవస్థ ఎంతగా దెబ్బ తిందో స్వయంగా చూశారు. పాఠశాలల విలీనం వలన భారీ సంఖ్యలో విద్యార్దులు బడికి రావడం మానేశారని మంత్రి భరత్ చెప్పారు. తాను గుర్తించిన సమస్యలను ఆయన మీడియాకు వివరించారు. తమ ప్రభుత్వం ఈ సమస్యలన్నిటినీ సరిచేసి విద్యావ్యవస్థని మళ్ళీ గాడిన పెట్టేందుకు గట్టిగా కృషి చేస్తుందని చెప్పారు.
మంత్రి భరత్ పరిశ్రమలు, ఆహారశుద్ధి శాఖ చూస్తున్నప్పటికీ ఈవిదంగా చొరవ తీసుకొని విద్యా వ్యవస్థని కూడా పరిశీలించడం చాలా అభినందనీయం.
Actor Suriya has a message for students who spend too much time making reels, focus…
స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన 40 శాతం సీట్లకు పట్టుబడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్…