
సాధారణంగా చాలా మంది రాజకీయ నాయకులు తమ రాజకీయ స్థాయిని పెంచి చూపుకొనేందుకు లేదా ప్రజలలో గుర్తింపు సంపాదించుకొనేందుకు తమ కంటే ఉన్నత స్థానాలలో ఉన్నవారిని ఎంచుకొని వారిపైనే విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు.
అదేవిదంగా ఓ స్థాయిలో ఉన్నవారు లేదా ఉన్నామని భావిస్తున్నవారు తమ కంటే దిగువ స్థాయిలో ఉన్న ప్రత్యర్ధులతో ముఖాముఖీ తలపడరు. అలా చేస్తే తమ స్థాయిని తామే తగ్గించుకొన్నట్లు అవుతుందని భావిస్తుంటారు.
ఉదాహరణకు కేసీఆర్ ఎల్లప్పుడూ ప్రధాని నరేంద్రమోడీని, రాహుల్ గాంధీలను విమర్శించేవారు. తద్వారా ఆయన జాతీయస్థాయిలో వారి సమఉజ్జీ అని ప్రజలు అనుకొనేలా చేసేందుకు ప్రయత్నించారు.
అదే… ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరూ నిత్యం తనపై ఎన్ని విమర్శలు చేస్తున్నా కేసీఆర్ స్వయంగా స్పందించేవారు కారు. వైఎస్ షర్మిలనైతే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పట్టించుకొనేవారు కారు.
కేసీఆర్ తన మంత్రుల చేత వారిరువురికి ఘాటుగా జవాబు చెప్పించేవారు. తద్వారా వారిది తన స్థాయి కాదని వారికీ, ప్రజలకు అర్దమయ్యేలా చేసేవారు.
కానీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకొన్నాక, కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయమని గ్రహించిన తర్వాతే కేసీఆర్ రేవంత్ రెడ్డిని పేరు పెట్టి విమర్శించడం ప్రారంభించారు. అంటే రేవంత్ రెడ్డి స్థాయి పెరిగిందని కేసీఆర్ అంగీకరించారని అర్దమవుతోంది. చివరికి ఆ రేవంత్ రెడ్డే ఆయనను గద్దె దించి ఇంటికి పంపించారు. అది వేరే సంగతి.
కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నిత్యం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను విమర్శిస్తూనే ఉంటారు. రకరకాల పేర్లు కూడా పెడుతూ ఎద్దేవా చేస్తుంటారు. వారి వ్యక్తిగత, కుటుంబ విషయాల గురించి కూడా మాట్లాడుతూ ప్రజల దృష్టిలో వారిని చులకన చేయాలని ప్రయత్నిస్తుంటారు.
కానీ పైన చెప్పుకొన్న రాజకీయ ఆనవాయితీ ప్రకారం చూస్తే, జగన్ తన స్థాయిని తానే దిగజార్చుకొని, తన ప్రత్యర్ధుల స్థాయికి దిగిపోయారు. పైగా వారిని చులకన చేసే ప్రయత్నంలో వ్యంగ్యంగా మాట్లాడుతున్న మాటలతో తానే ప్రజల దృష్టిలో చులకన అవుతున్నానని గ్రహించడం లేదు.
బహుశః కేసీఆర్‌లాగా ఆయన మోడీ, రాహుల్ గాంధీలను విమర్శించే ధైర్యం లేదు కనుకనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లతో సరిపెట్టుకొంటున్నట్లున్నారేమో?కనుక జగన్ తన స్థాయిని పెంచుకోలేకపోయినా కష్టపడి తగ్గించుకొంటూనే ఉన్నారని అర్దమవుతోంది.
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీలు అవలీలగా మెజార్టీ స్థానాలు దక్కించుకుంటాయి. కనుక ఏపీలో కూటమి పార్టీలు కూడా…
The Indian IT sector is already witnessing a period of turbulence with several companies starting…