పవన్ కళ్యాణ్ కు జగన్ మంచే చేశాడా?

YS Jagan - Vakeel Saabఇంకొన్ని గంటలలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. సినిమాకు సంబంధించిన స్పెషల్ షోలు, టిక్కెట్ల రేట్ల పెంపుకు పర్మిషన్ ఇవ్వలేదు. దానితో అప్పటికే ప్రకటించిన బెనిఫిట్ షోలు రద్దు చేశారు. దీనితో పలుచోట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు నిరసన తెలిపారు.

ADVERTISEMENT

ఇటీవలే కాలంలో విడుదలైన అన్ని సినిమాలకు పర్మిషన్ ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వరు? రాజకీయలను సినిమాలను ఎందుకు కలుపుతారు? అంటూ నినదించారు. కొన్ని చోట్ల సినిమా థియేటర్ల ముందు ధర్నాలు… థియేటర్ల అద్దాలు పగలగొట్టడాలు కూడా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే ఇంటి ముందు కొందరు ధర్నా కూడా చేశారు.

అయితే విశ్లేషకులు మాత్రం పవన్ మీద పగ తో ఆ పని చేసినా జనసేనకు అది మంచే చేస్తుందని అంటున్నారు. “జనసైనికులలో ఇప్పటికీ కొంత మంది వైఎస్సార్ కాంగ్రెస్ వైపే ఉన్నారు. గతంలో పలు సందర్భాలలో పవన్ కూడా అదే విషయం ప్రస్తావించారు. ఈ సందర్భంగా వారికొందరు జనసేన వైపుకు తిరిగివచ్చే అవకాశం ఉంది,” అని వారు విశ్లేషిస్తున్నారు.

“జగన్ వైపు ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు జనసేన వైపుకు మళ్ళినా అది జనసేనకు ప్లస్ అవుతుందనే చెప్పుకోవాలి. అదే సందర్భంలో ఈ అవమానం తిరుపతిలోని జనసైనికులను అధికార పక్షంపై మరింత బలంగా పోరాడటానికి స్ఫూర్తి రగిలిస్తుంది. సినిమా పరంగా ఇది కొంత నష్టమైనా జనసేనకు మాత్రం ఇదే మేలు చేస్తుంది,” అని వారు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories