గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు ప్రభుత్వం ఏం చెపుతుంది!

ఏపీ జ్యూడిషయల్ కాపిటల్ అదేలేండి కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పర్యటనలో భాగంగా జగనన్న చేదోడు పథకం నిధుల బటన్ నొక్కడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల గూడా అర్ధం కొంచెం ఆలోచిస్తే ఇట్టే అర్ధమవుతుంది.

విషయంలోకి వస్తే.., జగన్ సీఎం హోదాలో సభలు నిర్వహించడం గత ప్రభుత్వాన్ని నిందించడం సర్వ సాధారణమే. గతంలో టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల నియమించింది. గత ప్రభుత్వం పేదలకు రెండు వేలు పెన్షన్ ఇస్తాను అని హామీ ఇచ్చారు. కానీ వైసీపీ పార్టీ ఆ సంఖ్యను మూడువేలు చేసింది.

ADVERTISEMENT

అదే రాష్ట్రం, అదే బడ్జెట్ కేవలం మారింది ముఖ్యమంత్రి మాత్రమే అంటూ జగన్ చేసిన విమర్శలు విన్నవారికి కొన్ని సందేహాలు రాకమానవు. రాష్ట్రం అదే, ఇంచుమించుగా పేర్లు మార్చో, అంకెల సంఖ్యను మార్చో ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అవే అయినప్పుడు ఇంకా రాష్ట్రానికి జగన్ కొత్తగా చేస్తోంది ఏమిటో? అంటే లబ్ధిదారుల సంఖ్య పెంచగలిగాం అని సమర్ధించుకుంటారేమో! ఆలా అనుకున్న రాష్ట్ర బడ్జెట్ ను పెంచలేని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన మెలేముంది.

ఇదే బడ్జెట్ తో గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ప్రభుత్వ భవనాలను నిర్మించింది. కొన్ని కిలోమీటర్ల మీద రోడ్ల నిర్మాణం చేపట్టింది. రాష్ట్రంలో పాడయిపోయిన రోడ్లను పునరుద్ధరించింది. పోలవరం ప్రాజెక్టు పనులలలో వేగాన్నిపెంచి నిర్వాసితులకు అండగా నిలిచింది. హుదూద్ వంటి ప్రళయాన్ని తట్టుకుని మరల విశాఖ నగరాన్నిత్వరిత గతిన అదే హంగులతో తిరిగి నిలబెట్టగలిగింది. అమరావతి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏడాది కౌలు చెల్లించింది.

ఎస్సి,ఎస్టీ నిధులను దారి మళ్లించకుండా దళితుల అభివృద్ధికే ఆనిధుల కేటాయింపులు చేసింది. అగ్రవర్ణాలలోని పేదలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి చేయూతను అందించింది. 5 రూపాయలకే భోజనం అందిస్తూ అన్న కాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చింది. పట్టిసీమ వంటి ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తయ్యేలా చేసి కొన్ని వేల ఎకరాలకు సాగు నీరు, కొన్ని ప్రాంతాల వారికీ తాగు నీటిని అందించింది.

నదుల అనుసంధానంతో రాష్ట్రానికి నీటి కొరతను తగ్గించింది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలకు ప్రోత్సహకాలు అందిస్తూ చిత్తూర్ జిల్లాలో శ్రీ సిటీ అనే ఒక పారిశ్రామిక నగరాన్ని నిర్మించి కొన్ని వందల కంపెనీలకు అవకాశం కలిపించింది. తద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు అందించడం జరిగింది. అందులో భాగమే అనంతపురంలో కియా అనే కార్ల కంపెనీ ఏర్పాటు జరిగింది.

జగన్ అన్నట్లే అదే బడ్జెట్ తో చంద్రబాబు రాష్ట్రానికి ఇన్ని పనులు చేశారు. ఇప్పుడు జగన్ చేసి బాబు చేయని ఆపనులు ఏమిటో కూడా ఒకసారి చూద్దాం.ప్రజలమీద పన్నుల భారం పెంచలేదు.., అదే చెత్త పన్ను,ఆస్తి పన్ను,ఆదాయ పన్ను ఇలా పన్నుల భారం ప్రజలు మీద బాబు ప్రభుత్వంలో టీడీపీ పార్టీ వెయ్యలేదు. కరెంట్ చార్జీలు పెంచలేదు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకలేదు.ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు, పోలీస్ అధికారుల చలానాలు ఈ స్థాయిలో ఉండేవి కావు.

కల్తీ మద్యం అమ్మకాలతో ప్రజల ప్రాణాలను హరించలేదు, ఇసుక ధరను సిమెంట్ బస్తా ధరకు పెంచలేకపోయారు. ఇలా చంద్రబాబు జగన్ చేసిన కొన్ని పనులు చేయలేక పోయారు. వీటన్నిటి పరిశీలిస్తే జగన్ ఇదే బడ్జెట్ తో ప్రజలకు ఉచిత పథకాలు అలవాటు చేసి రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేశారు అనే విషయం అర్ధమవుతుంది.రాష్ట్ర ఆదాయాన్ని పెంచే నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది ఆలా కాక రాష్ట్ర ఖజానాను సంక్షేమం పేరుతో పంచుకుంటూ పొతే మిగిలేది వినాశనమే.

జగన్ చేసిన వ్యాఖ్యలు మరో ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే రాష్ట్రం,అదే బడ్జెట్ కానీ రాజధాని లేదు, పరిశ్రమల నిర్మాణాలు లేవు, ప్రోజెక్టుల పనులు పూర్తి కావడం లేదు,ధరలు తగ్గడంలేదు, పన్నుల భారం పెంచుకుంటూ పోతున్నారు కేవలం వైసీపీ ప్రభుత్వం చేస్తుంది సంక్షేమ పథకాల పేరుతో బటన్ నొక్కడం మాత్రమే అని ముఖ్యమంత్రి జగన్ చెప్పకనే చెపుతున్నారు. ఇదే బడ్జెట్ తో గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? రెండిని బేరీజు వేసుకుని రాష్ట్ర అభివృద్ధి కావాలో సంక్షేమ పథకాల పేరుతో వినాశనం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kobali: Ajay–Atul Set the Tone for Ranabaali

Kobali from Ranabaali is a fusion of devotion, anger and cinematic elements. The song presents…

2 minutes ago

Ramayana Release Date is Confirmed!

Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…

33 minutes ago