
‘వెయ్యి ఎలుకలు తిన్న హజ్ యాత్రకి బయలుదేరిన్నట్లు…’ అనే ఉర్దూ నానుడి అందరూ వినే ఉంటారు. గత 5 ఏళ్ళలో తిరుమలని భ్రష్టు పట్టించేసిన ఘనుడు వైసీపి అధినేత జగన్. ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం బయటకు పొక్కి దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కోవలసివస్తోంది.
ఈ వ్యవహారంతో వైసీపికి, ముఖ్యంగా జగన్‌కి రాజకీయంగా చాలా నష్టం జరుగుతోంది. ఈ సమస్య నుంచి బయటపడే మార్గమే కనిపించడం లేదు.
పైగా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ 11 రోజులు ప్రాయశ్చిత దీక్ష, సనాతన ధర్మ పరిరక్షణ అంటూ చేస్తున్న హడావుడితో రాష్ట్రంలో హిందువులు అందరూ వైసీపికి మరింత దూరం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
కనుక ఈ సమస్యల నుంచి బయటపడేందుకు వైసీపి కూడా ప్రాయశ్చిత్త పూజలకు సిద్దం అవుతోంది. ఈ నెల 28 శనివారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో పూజలలో పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు.
అయితే తమ ప్రభుత్వం చేసిన ఈ పాపాలు, అపచారాలకు ప్రాయశ్చిత్తంగా చేసుకొంటున్నామని చెపితే అందరూ హర్షించేవారు. కానీ తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు చెపుతున్న అబద్దాలు, చేస్తున్న రాజకీయాల వలన తిరుమల పవిత్రతకు, స్వామివారి ప్రసాదం విశిష్టతకు, టీటీడీ ప్రతిష్టకు భంగం కలుగుతోందని కనుక దానికి ప్రాయశ్చిత్తంగా ఆలయాలలో పూజలు చేయాలని జగన్ పిలుపునివ్వడం విశేషం.
జగన్ మాటలలోనే…. “తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది,” అని ట్వీట్ చేశారు.
అన్యమతస్థుడైన జగన్‌కి హిందూమతం, తిరుమల శ్రీవారిపై ఎటువంటి నమ్మకం, భక్తిభావం లేనందునే స్వామివారి ప్రతిష్ట, పవిత్రతకు భంగం కలిగించే సాహసం చేశారని చెప్పవచ్చు.
అధికారంలో ఉన్నప్పుడు చేయకూడనివన్నీ చేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వలన వాటికి భంగం కలుగుతున్నాయంటూ జగన్ మొసలి కన్నీళ్లు కార్చుతుండటం, ఆలయాలలో పూజలు చేయాలని పిలుపునివ్వడం రెండూ చాలా హాస్యస్పదంగా ఉన్నాయి కదా?
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…