Telugu

పాపం జగన్‌! జమిలి కలలు తెల్లారేసరికి మాయం!

జగన్ ఒక్కసారి అధికారం రుచి ఎలా ఉంటుందో చూశారు. కనుక మళ్ళీ మళ్ళీ కావాలనుకున్నారు. కానీ ప్రజలు వద్దనుకున్నారు. కనుక తాడేపల్లి ప్యాలస్‌లో 11 కుర్చీలు ఏర్పాటు చేసుకొని అదే శాసనసభ, అదే మంత్రివర్గ సమావేశం.. పార్టీయే ప్రభుత్వం అన్నట్లు కాలక్షేపం చేస్తున్నారు.

జగన్‌ తన మానాన్న తాను అలా కాలక్షేపం చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం ‘జమిలి ఎన్నికలు’ అంటూ హడావుడి చేసేసరికి జగన్‌ ఉలిక్కిపడి లేచి, నేడో రేపో జమిలి ఎన్నికలు జరిగిపోతాయని హడావుడి మొదలుపెట్టేశారు. 2027లో వీలైతే ఓ ఏడాది ముందే జమిలి ఉంటుందని, దానిలో మళ్ళీ జాక్‌పాట్ కొట్టేసి ముఖ్యమంత్రి అయిపోవచ్చని జగన్‌ ఆనందపడిపోయారు.

ADVERTISEMENT

ప్రస్తుతం జగన్‌ ఉన్న పరిస్థితిలో ఇటువంటి చిన్న చిన్న ఆనందాలు కూడా ఎంతో విలువైనవే. కనుక ఆయన అలా ఆశ పడటాన్ని తప్పు పట్టలేము. కానీ జగన్‌కు ఆ చిన్నపాటి ఆనందం కూడా లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం!

పార్లమెంటులో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల ప్రతిపాదన బిల్లులో 2034 తర్వాత జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది. అంటే మరో 10 ఏళ్ళ తర్వాత అన్నమాట!

జగన్‌కు బహుశః రాత్రి నిద్రలో కూడా కలలు జమిలిగానే వచ్చి ఉంటాయి. కానీ తెల్లారేసరికి అన్నీ మాయం అయిపోయాయి.

మరో రెండు మూడేళ్ళలో జమిలి అనుకుంటే ఏకంగా పదేళ్ళ తర్వాత అని తెలిసి జగన్‌ ఎంత ఆవేదన చెంది ఉంటారో తాడేపల్లి ప్యాలస్‌లో కుర్చీలు, బల్లలకు మాత్రమే తెలుస్తుంది.

జమిలి కలలు పగటి కలలుగా మిగిలిపోయాయి కనుక ఇక జగన్‌కు మిగిలిన ఓకే ఒక్క చిన్న ఆశాకిరణంగా పవన్ కళ్యాణ్‌ కనిపిస్తున్నారు.

నిత్యం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్ కళ్యాణ్‌ల మద్య చిచ్చు రగిలించేందుకు ప్రయత్నిస్తూ, ఏదో విదంగా పవన్ కళ్యాణ్‌ని బయటకు రప్పించి ప్రభుత్వం కూలిపోయేలా చేయగలిగితే తప్ప మళ్ళీ ఎన్నికలవచ్చే అవకాశం లేదు.. తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమూ ఉండదని జగన్‌కు తెలుసు. కనుక ఇక నుంచి అదే పని మీద ఉండాలి తప్పదు!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2: Poor Planning Kills Rajini’s 1000 Cr Dream?

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…

2 hours ago

After Vijay, Will Nayanthara Enter Tamil Nadu Politics?

Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…

2 hours ago