
చిత్తశుద్ధి లేని శివపూజలు ఫలించవని కేసీఆర్ నిరూపించి చూపారు. ఆయనకు జ్యోతిష్యం, వాస్తు, గ్రహఫలాలు, యజ్ఞయాగాదులపై చాలా నమ్మకం కలవారు. కనుక ప్రతీసారి ఎన్నికలకు ముందు శ్రీ మహారుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం చేస్తుంటారు. దాంతో తనకు తిరుగు ఉండదని గట్టిగా నమ్ముతారు.
కానీ మన కర్మ ఫలం అనేది కూడా ఒకటి ఉంటుందని, దానిని అనుభవించక తప్పదని మరిచిపోతుంటారు. చండీయాగం చేస్తే అవన్నీ కొట్టుకుపోయి తన ప్రత్యర్ధులపై విజయం సాధించగలమనే నమ్మకంతో కేసీఆర్ యాగాలు చేస్తుంటారు. కానీ ఆయన యదాద్రి ఆలయంలో తన బొమ్మని చిత్రీకరించుకున్నప్పుడే ఆయన దైవసమానుడు, దైవ స్వరూపుడనని అనే అహం ప్రదర్శించారు కనుక ఆయన చేసిన యాగాలు, వాస్తు ఏదీ కూడా శాసనసభ ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించలేకపోయాయి. పైగా ఎన్నికలో ఓడిపోగానే ఇంట్లో జారిపడి తుంటి ఎముక విరగొట్టుకున్నారు కూడా. ఆయన తన కోసం వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి వాస్తు ప్రకారం ప్రగతి భవన్, సచివాలయం నిర్మించుకుంటే, ఆ ఫలితం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి దక్కడం మరో విశేషం.
ఇక విషయానికి వస్తే, యజ్ఞయాగాదులపై పూర్తి నమ్మకం కలిగిన పక్కా హిందువు కేసీఆర్ చేస్తేనే అవి ఫలించనప్పుడు, వాటిపై ఏమాత్రం నమ్మకంలేని క్రీస్టియన్ మతస్తుడైన జగన్మోహన్ రెడ్డి చేస్తే ఫలిస్తాయా?అంటే కాదనే ఎవరైనా చెప్తారు.
కానీ ఇన్నేళ్ళుగా కేసీఆర్‌తో సహవాసం చేశారు కనుక బహుశః ఆయన సూచన ప్రకారమే, తాడేపల్లి ప్యాలస్‌లో గత 41 రోజులుగా 45 మంది వేదపండితుల చేత శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం చేయించారు. అది నిన్నటితో పూర్తవడంతో వేదపండితులు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆ ఫోటోలు వైసీపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కానీ ఈసారి వారి యాగం పూర్తయ్యేసరికి అనూహ్యంగా ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో స్పష్టం అయిపోయింది.
జగన్మోహన్ రెడ్డే ఈ యాగం చేయించినప్పటికీ బహుశః వేద పండితులు వైసీపి ఓడిపోవాలని, జగన్ గద్దె దిగిపోవాలని కోరుకుంటూ (కుట్ర) చేశారో ఏమో తెలీదు కానీ వైసీపి ఓటమి కళ్లెదుట కనిపిస్తోంది. కానీ తెలిసో తెలియకో జగన్ నివాసంలో ఈ సత్కార్యం జరిపించారు కనుక ప్రశాంత్ కిషోర్ చెప్పిన్నట్లు కనీసం 51 సీట్లు అయినా తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుందేమో… చూడాలి!
Three Cockroach Janata Party (CJP) leaders detained ahead of a protest demanding the resignation of…
Ravi Teja joins filmmaker Vivek Athreya, who is known for his distinct storytelling style, for…