నేను చెప్పాలనుకున్నదే చెప్తా… మీరు అడిగేవి కాదు… జగన్..!

YS Jagan- mediaతుని విధ్వంసంలో ముద్రగడ పద్మనాభం ప్రమేయం ఉందని తేలిన తర్వాత, సీఐడీ పోలీసులు ముద్రగడను అరెస్ట్ చేసిన వైనం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ పై తన అభిప్రాయాలను తెలిపేందుకు మీడియా ముందుకు వచ్చిన జగన్, కాపు ఉద్యమనేత ముద్రగడకు మద్దతు ప్రకటించకుండా… ప్రభుత్వ తీరును మాత్రం విమర్శించి వెళ్ళిపోయారు. మరో విశేషం ఏమిటంటే… ఈ ప్రెస్ మీట్ ఆద్యంతం… ‘కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పోరాడుతున్నారు’ అన్న అంశం కూడా ప్రస్తావించలేదు. అలాగే ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ అంటూ చెప్పిన జగన్ నోటి వెంట ‘కాపు రిజర్వేషన్’ మాట రాకపోవడం కాపు వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చే అంశమే.

ADVERTISEMENT

ఇదిలా ఉంటే… ప్రెస్ మీట్ అన్న పదానికి కొత్త అర్ధం చెప్పేలా జగన్ పోకడ కొనసాగుతుండడం విశేషం. సాధారణంగా ప్రెస్ మీట్లంటే… వారు చెప్పాలనుకున్నది చెప్పిన తర్వాత… మీడియా ప్రతినిధులు ప్రజా సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటారు. కానీ, జగన్ తీరే వేరు కదా..! మొత్తం తానూ చెప్పాలనుకున్నది పూర్తయిన తర్వాత మరొక్క మాట కూడా ప్రస్తావించకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఓ పక్కన మీడియా ప్రముఖులు ప్రశ్నలు వేస్తుండగానే జగన్ ఏ మాత్రం పట్టించుకోకుండా లోటస్ పాండ్ లోపలికి వెళ్ళిపోవడం మీడియా ప్రముఖులకు మరొక సారి చేదు అనుభవాన్ని చవిచూసేలా చేసింది.

జర్నలిస్టులకు కనీస మర్యాదలు పాటించని జగన్, అదే మీడియాకు విలువలు ఇవ్వడం లేదని చంద్రబాబుపై విమర్శలు చేయడం అత్యంత హేయమైన చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షి ప్రసారాలు ఆపేసారంటూ నిరాధారమైన ఆరోపణలు చేసిన జగన్, ప్రెస్ మీట్ చివరికి చేసిందేంటి..? తమ ప్రశ్నలతో సిద్ధంగా ఉండి అడుగుతున్న తరుణంలో కనీసం వెనక్కి తిరిగి మరోమారు మాట్లాడదాం… అని కూడా చెప్పకుండా వెళ్ళిపోతూ ఓ రకంగా మీడియా ప్రతినిధులను అగౌరవపరిచారు. మరి అలాంటి జగన్ తన మీడియా విషయానికి వచ్చే సరికి మండిపడుతూ మాట్లాడడం… బహుశా ఒక్క జగన్ కే ఇలాంటి ప్రవర్తన సాధ్యమేమో అనిపించక మానదు.

అయితే జగన్ విషయంలో ఇప్పటికే ఇలాంటి అనుభూతులు మీడియా ప్రతినిధులు చాలా సార్లు చవిచూశారు. తానూ చెప్పదలుచుకున్నది, పేపర్ పైన నోట్ చేసుకుని వచ్చినవి మాత్రమే…. ఒక పాఠం మాదిరి చెప్పేసి… వెళ్ళిపోవడం… అనేది గత కొన్నేళ్ళుగా జగన్ ప్రెస్ మీట్ లలో జర్నలిస్టులు చవిచూస్తున్న విషయాలే! తానూ గౌరవం ఇవ్వకుండా… ఎదుటి వారి నుండి అదే గౌరవాన్ని ఆశించడం అనైతికం కాదా..? అన్న ప్రశ్నలు కోకొల్లలుగా నెటిజన్ల నుండి జగన్ పైకి వస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories