జగన్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారో?

ఏపీ రాష్ట్ర రాజకీయలంతా అరెస్టులు – జైళ్లు – బెయిల్లు – కస్టడీలు – పిటిషన్ల చుట్టే తిరుగుతున్నాయి. చంద్రబాబు నేరస్తుడే అందుకే జైలుకు వెళ్ళాడు అంటూ వైసీపీ అయితే గతంలో మీ అధినేత ఆర్ధిక నేరస్తుడిగా కటకటాలు లెక్కించలేదా? అంటూ ఇటు టీడీపీ రాష్ట్రంలో ఒకరి పై మరొకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారే కానీ అసలు కథలో లాజిక్స్ ప్రజలకు వివరించడంలో ఇరు పార్టీలు తప్పటడుగులే వేస్తున్నారు.

ADVERTISEMENT

వైసీపీ అధికార పార్టీ విషయానికి వస్తే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో స్కామ్ చేసారంటూ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిన విషయం అందరికి తెలిసిందే. అయితే గతంలోనూ జగన్ కొన్ని వేల కోట్ల ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని అప్పటి
కేంద్ర ప్రభుత్వం, సిఐడి, ఈడీ పదుల సంఖ్యలో జగన్ పై తగిన ఆధారాలతో కేసులు వేసి కోర్ట్ ముందు హాజరు పరిచింది.

అయితే జగన్ అరెస్టు కన్నా కొన్ని నెలల ముందే ఈ కేసు తాలూకా సంబంధిత అధికారులను, ఉద్యోగులను, ఆయా శాఖల మంత్రులను కొద్దికాలం విచారించి వారి వద్ద సరైనా ఆధారాలను సేకరించి వారిని నిందితులుగా న్యాయస్థానాల ముందు హాజరు పరిచి శిక్షలు ఖరారు చేశారు. అలా శిక్షను అనుభవించిన వారిలో ఐఏఎస్ శ్రీ లక్ష్మి, మిడి.రాజగోపాల్, డిపి.ఆచార్య వంటి అధికారులు ఉన్నారు. అలాగే మోపిదేవి రమణ వంటి నేతలు లేకపోలేదు.

స్కీమ్ లో స్కామ్ లు జరిగితే నోట్ ఫెయిల్ తయారుచేసిన గిరిధర్, జీవో జారీ చేసిన నీలం సహానీ, డబ్బులు రిలీజ్ చేసిన కళ్ళం అజయ్, ప్రేమ చంద్రా రెడ్డి, నోట్ ఫెయిల్ ను గుజరాత్ తీసుకువెళ్లిన సునీత ఇలా ముందుగా అధికారుల నుండి కదా విచారణ మొదలు పెట్టాల్సింది. ముఖ్యమంత్రి అనేవాడు పాలసీ మేకర్ అవుతారు కానీ నేరస్తుడేలా అవుతాడు?

అయినా జగన్ అరెస్టయిన నాటికి ముఖ్యమంత్రి కాదు కేవలం ముఖ్యమంత్రి కొడుకు మాత్రమే అనే విషయాన్ని వైసీపీ మరిచినట్టున్నారు. అలాంటప్పుడు పాలసీ మేకర్ జగన్ కాలేరు కదా? అయినా కూడా సంబంధిత అధికారులను ముందుగా విచారించి వారి నుండి సరైనా సాక్ష్యాధారాలు సేకరించి, జగన్ ను కూడా కొన్ని రోజుల పాటు విచారణ జరిపిన పిదపనే అరెస్ట్ చేయడం జరిగింది.

చంద్రబాబు అరెస్ట్ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేయడమే అనుమానాలకు తావిస్తుంది. పాలసీ మేకర్ చేసిన పాలసీని సక్రమంగా అమలుచేసే భాద్యత అధికారులదే అవుతుంది. తానూ చేపట్టిన కార్యక్రమాలు ప్రజల వద్దకు అధికారులు స్థిరంగా చేరవేస్తున్నారా లేదా అనేది ఆయా శాఖలు పర్యవేక్షించాలి. చంద్రబాబు తప్పు చేశాడా, లేదా? అన్న ప్రశ్న కు సమాధానం న్యాయస్థానాలు ఇస్తాయి.

కానీ వైసీపీ ప్రభుత్వం బాబు ని అరెస్ట్ చేసిన విధానం మాత్రం కచ్చితంగా రాజ్యంగా విరుద్ధమనే చెప్పాలి. తల్లితండ్రులు ఫీజు కట్టి పిల్లలను బడికి పంపుతారు. అయితే బడిలో పిల్లలు చేసే పొరబాటుకు శిక్ష తల్లితండ్రులదా? ఆశిక్ష తాలూకా ఫలితం పేరెంట్స్ మాత్రమే అనుభవించాలి అనడం దేనికి సంకేతమో వైసీపీ ప్రభుత్వమే బదులివ్వాలి. తప్పు చేస్తే నేరస్తులవుతారు అంతే కానీ తప్పుడు కేసులు పెడితే కాదు. జగన్ మరీ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారో!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Hanuman Ansh Telugu Flops: What Went So Horribly Wrong?

Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…

15 minutes ago

విజయ్‌ మొహం ఎప్పుడూ ఇంతేనా? కాస్త నటించొచ్చుగా?

ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…

24 minutes ago