జగన్ పాలసీపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసారా?

KCR's-Humble-Talk-after-Huzurnagar-Victoryహుజుర్ నగర్ ఉపఎన్నిక లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘనవిజయం సాధించడంతో తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ మొట్టమొదటి సారిగా మీడియాతో ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడారు. సమ్మెతో ఆర్టీసీ కార్మికులు దురంహంకార పద్ధతిని అవలంబించారని సీఎం కేసీఆర్‌ అన్నారు.

కార్మికుల వేతనాలు నాలుగేళ్లలోపు 67 శాతం పెంచామని.. దేశంలో ఎక్కడైనా ఇలా పెంచిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. కార్మికులు ఇంకా గొంతెమ్మ కోర్కెలు కోరడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యడం అనేది జరగని పని అని ఆయన మరోసారి ఘంటాపథంగా చెప్పారు.

ADVERTISEMENT

‘‘ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎవరు పడితే వారు కోరితే కలుపుతారా? ఎవర్ని మోసం చేయాలని? రాష్ట్ర ప్రభుత్వంలో 57 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత వారు కూడా విలీనం చేయాలని కోరితే ఏం చేయాలి? ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అనేది అర్ధం పర్ధం లేని, అసంబద్ధమైన, అర్ధరహితమైన, తెలివి తక్కువైన డిమాండ్,” అని కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో అక్కడి ప్రభుత్వం ఇదే విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలోకి కలిపే ప్రయత్నం చేస్తుంది. ఇది జగన్ పాలసీ మీద కేసీఆర్ ఘాటుగా స్పందించారు అనుకోవాలా? ఎందుకంటే ఏపీలో ఆర్టీసీ, తెలంగాణాలో ఆర్టీసీ ఒకే పరిస్థితిలో ఉన్నాయి. ఒకటి ఇక్కడ సరైనది కాకపోతే అక్కడ కూడా అదే పరిస్థితి. ఆర్టీసీ భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నకు “ఆర్టీసీ సమ్మె కాదు.. ఆర్టీసీయే ముగుస్తుంది’’ అని కేసీఆర్‌ ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం.

ADVERTISEMENT
Latest Stories