
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గడప గడపకి కార్యక్రమం ప్రకటించి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తప్పనిసరిగా ప్రజల వద్దకు వెళ్ళి తన బటన్ నొక్కుడు గురించి చెప్పమని ఆదేశించారు. కానీ అప్పుడే చాలా మంది మొహం చాటేసేవారు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు, అదీ.. ఎన్నికలకు మరో నాలుగేళ్ళు సమయం ఉన్నప్పుడు ప్రజల వద్దకు వెళ్ళమని చెపితే వెళ్తారా? అంటే వెళ్ళరని నిరూపించారు వైసీపీ నేతలు.
కూటమి ప్రభుత్వం వరుసపెట్టి ఎన్నికల హామీలు అమలుచేస్తూ, సంక్షేమ పధకాలతో జగన్ కంటే ఎక్కువ సొమ్ము ప్రజలకు చెల్లిస్తున్నప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తామని, వైసీపీ నేతలు జగన్ ప్రకటించిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో పాల్గొనలేదు.
ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలను కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని జగన్ భావిస్తే, సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలోనే వైసీపీ నేతలు సైతం ఈ కార్యక్రమాన్ని పట్టించుకోలేదు.
ఇక ఇతర జిల్లాలలో అయితే వైసీపీ నేతలు ఇళ్ళలో నుంచి బయటకు రానేలేదు. ఇప్పటి నుంచి శ్రమ పడినా ఎన్నికలలో టికెట్ ఇస్తారో లేదో తెలీదు. ఒకవేళ ఇచ్చినా, కూటమి ప్రభుత్వం తీరు, జోరు చూస్తుంటే వైసీపీ గెలుస్తుందనే నమ్మకం కలగడం లేదు.
సరిగ్గా ఇదే సమయంలో సిఎం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎప్పటిలాగే 1వ తేదీన పింఛన్లు, తల్లికి వందనం, మత్స్యకారుల భరోసా వంటి పధకాల డబ్బులు చేతిలో పడటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
కనుక ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్ళి సిఎం చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏవిదంగా స్పందిస్తారో వారికీ తెలుసు కానీ ఈ విషయం జగన్‌కు తెలీదు. ఆయనకు చెప్పే ధైర్యం పార్టీ నేతలకు లేదు. కనుక ఆయన ముందు తలాడించి వచ్చేశారు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.
తాను ప్రకటించిన ఈ కార్యక్రమం మొదలుపెట్టక మునుపే ఈవిదంగా ఫెయిల్ అవడం, మరో పక్క టీడీపీ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం జగన్‌కు కడుపు మంట కలిగించి ఉండవచ్చు. కానీ తాను తాడేపల్లి ప్యాలస్‌లో సేద తీరుతూ పార్టీ నేతలని ప్రజల వద్దకు వెళ్ళమంటే ఎందుకు వెళతారు?అని ఆలోచన జగన్‌కు ఎందుకు కలగలేదో? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ సామాన్య ప్రజల ఇళ్ళకు వెళ్ళి వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. ఏ పని లేని జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలస్ గడప దాటడం లేదు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…