
అక్రమ ఆస్తుల కేసుల్లో ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టులో హాజరైన జగన్ రెడ్డి శుక్రవారం సియంగా ప్రతిపక్ష పార్టీల అభిమానులు పిలుస్తున్నారనో లేకపోతే కోర్టులకు శని, ఆది వారాలు సెలవు దినాలు కనుక వేదింపులు చేయవచ్చు అనో, సోషల్ మీడియా కార్యకర్తల మెుదలు సొంత పార్టీ యంపి వరకు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టులు చేపించిన జగన్ రెడ్డిప్రభుత్వం చివరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అత్యదిక కాలం ముఖ్యమంత్రిగా బాద్యతలు నిర్వహించి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు విషయంలో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. శుక్రవారం అర్దరాత్రి నంద్యాలలో చంద్రబాబు బసచేసిన ఫంక్షన్ హాల్ దగ్గరకు చేరుకున్న సిఐడి పోలీసులు ఆ తరువాత వేసిన పిల్లి మెుగ్గలు చూసి ఆశ్చర్యపోవడం జనాల వంతయ్యుంది.
తొలుత నోటీసులు ఇవ్వడానికి వచ్చాం అంటూ చెప్పారు, తరువాత తమతో తీసుకెళ్లి విచారణ చెయ్యాలి అని చెప్పారు. దీనిని తెలుగుదేశం నాయకుల ప్రతిఘటించి ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పమని నిలదీస్తే కుటుంబసభ్యలకు తప్ప బయటవారికి చెప్పం అని డ్రామాలు ఆడారు, మరోసారి బాబు విశ్రాంతి తీసుకుంటున్న బస్సుని టోవ్ చేసుకుని వెళ్తాం అని బెదిరించారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అంటే కేసు ఇంకా పెడుతున్నాం అంటూ మరొక కథ. ఎట్టకేలకు మూడు గంటల ప్రాంతంలో బాబు గారి బస్సు డోర్ బాది ఆయనను నిద్రలేపి నోటీసులు అంటూ మెుదలు పెట్టారు. అయన ఏ కారణంతో నోటీసులు, ఏమి కేసు అని అడిగితే నీళ్ళు నమిలారు. కనీసం యఫైఆర్ లో పేరు కూడా లేని ఒక కేసులో A37 గా పేర్కొని మరొక మూడు గంటల తరువాత ఆయన్ని అరెస్ట్ చేసారు. మరో వైపు టిడిపి యువనేత లోకేష్ ను ఏవిదమైన కారణం లేకుండా, నోటీస్ ఇవ్వకుండా నడి రోడ్డుపైన డీటైన్ చేసి ఐదు గంటలు డీటైన్ చేసి చివరకు తండ్రిని కలుసుకోవడానికి అనుమతించారు. అవనీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవలసిన అవసరం ఉన్నా అనుమతి తీసుకోలేదు. ఇంక అక్కడ నుంచి విచారణ పేరుతో మరొక తంతు, ఏ కేసో తెలియదు, ఆధారాలు లేవు, యఫ్పైఆర్ లో పేరు లేదు, చివరకు 23 గంటల 45 నిమిషాల కస్టడీ తరువాత చట్ట ప్రకారం 24 గంటల్లో కోర్టులో ప్రవేశ పెట్టాలి కనుక చివరి 15 నిమిషాల్లో కోర్టులో హాజరు పరిచారు.
ఎక్కడ ఒక రూల్ ప్రకారం కానీ, ఒక ప్రోటోకాల్ ప్రకారం కానీ ఏదీ జరపకుండా అత్యంత హీనంగా ప్రవర్తించిన వ్యవస్ధని ప్రజలు అసహ్యించు కుంటున్నారు. టిడిపి శ్రేణులైతే నంద్యాల నుండి మంగళగిరి వరకు రోడ్లపై అడుగడుగునా అడ్డుపడి నిరసన తెలిపారు. చంద్రబాబు స్ధాయి వ్యక్తికే ఇలా జరిగితే రాష్ట్రంలో సామాన్యుల పరిస్ధితి ఏంటి అంటూ తమ సన్నిహితులతో చర్చించుకుంటున్నారు. ఇలా అన్ని రకాలుగా చట్టాన్ని తుంగలో తొక్కి చేసిన అరెస్టు తంతు వల్ల బావ కళ్ళల్లో ఆనందం వచ్చిందేమెూ కానీ ప్రజల్లో చీదరింపులు ఎలా ఉన్నాయెూ అధికార కమ్మిన కళ్ళకు ఇప్పుడు కనిపించకపోవచ్చు గానీ కనిపించిన రోజున మాత్రం వీళ్ళ పరిస్ధితి దారుణంగా ఉంటుంది. ఈ హైడ్రామా మీద సోషల్ మీడియాల్లో తిరుగుతున్న ఒక పోస్టు ఇక్కడ చెప్పుకోవాలి. “జగన్ రెడ్డి ఆశయం నెరవేర్చడానికి, ఆ కులానికి చెందిన వ్యక్తి కంప్లైట్ ఇస్తే, ఆ వర్గం లాయరు వారెంట్ తెస్తే, ఆ వర్గం ఆయనే అరెస్ట్ అర్డర్ ఇస్తే, ఆ వర్గం అధికారి అరెస్ట్ చేస్తే, బాబుకు మెడికల్ టెస్ట్ చేసింది ఆ వర్గం డాక్టర్, కోర్టులో కేసు వాదించిందీ ఆ వర్గం ఎజిపి, ఇదంతా పర్యవేక్షణ చేస్తుంది ఆ వర్గం సలహాదారైతే, పోలీసు శాఖ ముఖ్య అధికారి, యంత్రాంగాన్ని నడిపించే ప్రభుత్వ ప్రదాన సెక్రటరీ ఆ అధికారే. వీళ్లంతా కలిసి కష్టపడుతన్నది ప్రభుత్వాన్ని నడుపుతున్న సొంత వర్గం నాయకుడి కోసం” అన్నది ఆ పోస్టు సారాంశం.
నిజానికి వీళ్ళు చెబుతున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాం జరిగిన సమయంలో దాని కార్యదర్శి గా ఉన్న ప్రేమచంద్రారెడ్డిపై గానీ, ఆ ప్రాజెక్టు ఆమెూదించిన అప్పటి ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి కళ్ళం అజయ్ రెడ్డి మీద కానీ కేసు పెట్ట కుండా వారిరివురికీ పదవులు ఇచ్చిన జగన్ రెడ్డిప్రభుత్వం మిగిలిన వారిని తమ రెడ్డి అధికారులతో వేదించడం చూస్తే సోషల్ మీడియాల్లో కామెంట్లు చేస్తున్నట్టు రెడ్ల కోసం, రెడ్ల చేత అన్న విధంగా ఉండటం విచారకరం. కానీ ఇంత నేలబారు పద్దతిలో చెయ్యడం వల్ల మెుత్తం ఆవర్గానికే చెడ్డ పేరు వస్తుంది. భవిష్యత్తులో వారికి కీలక భాద్యతలు ఇవ్వాలంటే ఇతరులు ఆలోచించే విదంగా చేయడం దురదృష్టకరం!
Anil Ravipudi knows how to make fans laugh, whistle and celebrate in theaters. But what…
Rohith is one of the potential Bigg Boss Telugu contestants who could win the title.…