Telugu

సంపూర్ణ రుణమాఫీ సరే సంపూర్ణ మధ్యపానం మాటేంటో?

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మానిఫెస్టో రూపంలో హామీలు ఇవ్వడం వాటిలో కొన్ని పూర్తిగా, మరి కొన్ని పాక్షికంగా అమలుచేయడం జరుగుతుంది. మరి కొన్ని హామీలు హామీలుగానే మిగిలిపోవడం కూడా రాజకీయాలలో పరిపాటే.

వైసీపీ నేతలకు తమ పార్టీ మానిఫెస్టో అమలు మీద ఉన్న శ్రద్ధ కన్నా 2014 టీడీపీ ప్రభుత్వ మానిఫెస్టో మీదే దృష్టి ఎక్కువగా ఉన్నట్టుంది. అప్పటి ప్రభుత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకించిన ఫలితమే నాటి వైసీపీ ప్రభుత్వం పాలన అనేది వైసీపీ నేతలు మరిచినట్టున్నారు.

ADVERTISEMENT

వైసీపీ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబుని మోసగాడిగా చూపిస్తూ సంపూర్ణ రుణమాఫీ అంటూ 2014 ఎన్నికలలో హామీ ఇచ్చి పాక్షిక రుణమాఫి చేసి ప్రజలను మోసం చేసారని విమర్శలు చేస్తూ ఒక ట్వీట్ వేశారు. దాని పై స్పందిస్తూ టీడీపీ నేతలు కూడా నాటి వైసీపీ మానిఫెస్టో అమలు గురించి కూడా ఒక్కసారి చర్చకు వస్తే బాగుంటుందని పిలుపునిస్తున్నారు.

మీ బిడ్డని ఆశీర్వదించి అధికారం వైసీపీ పార్టీకి కట్టబెడితే రాష్ట్రంలో సంపూర్ణ మధ్యపానం అమలుచేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు చేస్తుంది ఏమిటో ప్రజలకు చెప్పాలి? ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం మానిఫెస్టో అమలు అవుతుందా? ప్రభుత్వ దుకాణాలలో అమ్మే మద్యాన్ని సేవించి వందల సంఖ్యలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం చెప్పే సమాధానం ఏమిటో? ఇది ప్రజలను మోసం చేయడం కాదు ప్రజలను హతమార్చడమే అవుతుంది.

మీ బిడ్డా, మీ అన్న వస్తున్నాడు, జగన్ “మాట తప్పదు మడం తిప్పాడు” అంటూ ఆర్భాట ప్రచారాలు చేసుకుని అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలో చేస్తున్న మద్యం వ్యాపారంతో ఎంతమంది అక్కచెల్లళ్ళ ఉసురు పోసుకున్నారో? రెండు వారాలలోనే సీపీఎస్ రద్దు అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ఇచ్చిన హామీ ఎటుపోయిందో..,మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్రం మెడలు వంచి తెస్తాను అన్న ప్రత్యేక హోదా సంగతేంటో.., కూడా ఒక్కసారి వైసీపీ నేతలు చెపితే బాగుంటుంది.

గత ప్రభుత్వ విధానాలతో ప్రజలను పూర్తిగా సంతృప్తి చెందలేదు కనుకనే వైసీపీ అధికారంలోకి వచ్చింది. జవాబు దొరికిన ప్రశ్నకే తిరిగి ప్రశ్న అడిగిన చందంగా వైసీపీ నేతలు ఇంకా గత ప్రభుత్వం తాలూకా ఫెయిల్యూర్ నే చూపిస్తూ తన పాలన కొనసాగించాలని చూడడం కాదట విడ్డురంగా ఉంది. ఇదే ధోరణిలో వైసీపీ ముందుకెళ్తే 2019 ఎన్నికలలో టీడీపీ ఎదుర్కున్న పరిస్థితులనే చవి చూడాల్సి వస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Flying Cars On Roads In 2Yrs? Elon Giving New Hopes!

Elon Musk has become the first person in history to reach a trillion-dollar net worth,…

4 minutes ago

Ramayana and Varanasi: A Battle of Grandeur

The Ramayana teaser has given audiences an idea of the scale Namit Malhotra is planning…

34 minutes ago