‘రక్షణ’ ఇవ్వలేని వారు ‘రక్షా బంధన్’..హౌ?

నేడు రాష్ట్ర వ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్న వేళ రాష్ట్రంలో ఒక ఆసక్తికర సన్నివేశం నెలకొంది. రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అంటూ అన్ని రాజకీయ పార్టీల అధినేతలు, నాయకులు అందరు వారి వారి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.

అయితే వైసీపీ పార్టీ అధినేత జగన్ కూడా ఇదే తరహాలో అక్కచెల్లెమ్మళ్లకు తన శుభాకాంక్షలు తెలియచేసారు. అయితే దీనిమీద సోషల్ మీడియాలో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. నీ ప్రభుత్వ హయాంలో తమకు ఏపీలో రక్షణ లేదని సొంత చెల్లెల్లు రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించిన విషయం మరిచిపోయారా జగనన్నా? అంటూ సునీత, షర్మిల వీడియో లను పోస్టు చేస్తున్నారు.

ADVERTISEMENT

తమ సొంత మీడియా ఛానెల్ సాక్షిలో సొంత చెల్లెళ్ళ వ్యక్తిగత జీవితాల పై ప్రచురించిన కథనాలు, రాసిన నీలి రాతలు గుర్తులేవా? చెల్లెలు కట్టుకునే చీర రంగును కూడా విమర్శించిన ఉదంతాలు విస్మరించారా? చెల్లికి రాజకీయ భవిష్యత్ లేకుండా రాష్ట్రం దాటించిన ఇటువంటి నువ్వా అక్క చెల్లెమ్మలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపేది అంటూ జగన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

‘చెప్పేవాడికి వినేవాడు లోకువ అనే చందంగా’ జగన్ కు ఏపీ ప్రజలు లోకవయ్యారు అంటూ మండిపడుతున్నారు టీడీపీ శ్రేణులు. సొంత చెల్లి షర్మిలను రాజకీయం ఎదగనివ్వకుండా ఆర్థికంగా దెబ్బ కొట్టిన జగన్ రాష్ట్రంలో మహిళల ఎదుగుదలకు చేయూతనిస్తాను అనడం హాస్యాస్పదం కాదా అంటూ జగన్ ను నిలదీస్తున్నారు.

చెల్లిని అడ్డుపెట్టుకుని పార్టీని నిలబెట్టుకున్న వాడు సొంత బాబాయ్ వివేకా హత్యా కేసులో ఆరోపణలను ఎదుర్కుంటున్నవాడికి మద్దతుగా ఉండి సొంత చెల్లికి అన్యాయం చేయడమేనా జగన్ మహిళలకు చేసే న్యాయం?

చేతిలో అధికారం ఉన్నప్పుడే సొంత చెల్లికి రక్షణ కల్పించలేని జగన్, చెల్లెలి పోరాటానికి తోడుగా ఉండి న్యాయం చెయ్యలేని జగన్ ఇటువంటి పోస్టులు పెట్టి తనను తానే తగ్గించుకుంటున్నారు అనే వాదన బలంగా వినపడుతుంది.

‘చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి తప్పుడు పనులు’ అనే సామెత మాదిరి జగన్ చెప్పేవాటికి చేసే వాటికీ సంబంధం ఉండవని ఈ పోస్టు తో మరోసారి రుజువు చేసుకున్నారు. దీనితో ‘రక్షణ’ ఇవ్వలేని వారు ‘రక్షా బంధన్’..హౌ? అంటూ సోషల్ మీడియాలో జగన్ పై ఎదురు దాడి జరుగుతుంది. ఎటు చూసిన జగన్ కు షర్మిల కొరకరాని కొయ్యగా మారిందనే చెప్పాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీకి ఈ నమ్మకం కల్పించింది కూటమి పార్టీలే కదా?

స్థానిక సంస్థల ఎన్నికలలో మేయర్, మున్సిపల్ చైర్మన్‌, చైర్ పర్సన్ సీట్ల కోసం కూటమిలో మూడు పార్టీలు పట్లు పట్టాల్సిరావడం…

21 minutes ago

YSRCP Files Two Petitions in High Court Ahead of AP Local Body Elections

With local body elections approaching in Andhra Pradesh, the YSR Congress Party (YSRCP) has filed…

22 minutes ago