Telugu

వైసీపీ గోడమీద పిల్లి పాత్ర పోషిస్తుందా.?

సర్ ప్రక్రియలో అవకతవకలు, ఆ ప్రక్రియ ద్వారా దేశంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోంది, కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ కేంద్ర కార్యాలయంగా మారింది….అంటూ ఇలా అటు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ టార్గెట్ గా కేంద్ర ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంగా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయి.

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఒక్కపక్క కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఢిల్లీ వేదికగా నిరశన కార్యక్రమాలు చేపడుతుంది, మరోపక్క కాక్రోచ్ జనతా పార్టీ అదే డిమాండ్ తో కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తూ జంతర్ మంతర్ 2.0 నిర్వహించేందుకు సిద్దమయ్యింది.

ADVERTISEMENT

దేశంలో ఉన్న బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఇండి కూటమికి మద్దతుగా సీఈసీ జ్ఞానేశ కుమార్ రాజీనామ కోసం పట్టుబడుతున్నాయి. ఆప్ వంటి జాతీయ పార్టీ నుంచి సీజేపీ వంటి సోషల్ మీడియా పార్టీ వరకు, బీజేపీ ప్రత్యర్థి అయినా కాంగ్రెస్ నుంచి దేశంలో బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయపార్టీలన్ని కూడా సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా తమ గళం విప్పుతున్నారు.

పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ, మహారాష్ట్ర నుంచి శివసేన, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, అలాగే బీహార్ నుంచి రాష్ట్రీయ జనతా దళ్, జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా, జమ్మూ – కాశ్మీర్ నుంచి JK పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ,

కేరళం నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, తమినాడు నుంచి విజయ్ టీవీకే…ఇలా పలు రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కూడా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఎన్డీయే ప్రభుత్వం పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. నీట్ ఉద్యమం తరహాలోనే సర్ ఉద్యమం కూడా ముందుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం పై పై చేయి సాధించేందుకు ఇండి కూటమి నానాటికి తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

అలాగే ఇక ఇటు తెలంగాణ నుంచి బిఆర్ఎస్ పార్టీ తరుపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేసి తీరాలంటూ తన పార్టీ స్టాండ్ కూడా వినిపించారు. ఇక కాంగ్రెస్, ఆప్ ఇప్పటికి ఈ అంశం లో ముందువరుసలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో తమకు ఎవరితో రాజకీయ పొత్తులు లేవని, ఏ పార్టీతో తెరవెనుక సంబంధాలు లేవని, ఆ అవసరం కూడా తమ పార్టీకి ఉండదని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోనే ఎదిరించి కాంగ్రెస్ పార్టీ పై ఒంటరిగా రాజకీయ యుద్ధం చేసారని చెప్పుకునే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు బీజేపీ కి వ్యతిరేకంగా, సర్ ప్రక్రియ పై ఎటువంటి విమర్శలు ఎక్కుపెట్టలేదు.

అలాగే బీజేపీ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్ రాజీనామ కోసం కూడా గళం విప్పలేదు. ఎన్డీయే కూటమి లో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలతో రాజకీయ యుద్ధం చేయడానికి క్షణం కూడా ఆలోచించని జగన్ బీజేపీ పై మాత్రం పెదవి విప్పేందుకు వెనకడుగు వేస్తున్నారు.

ఎన్డీయే కూటమిలో భాగం కానీ అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో జ్ఞానేశ్ రాజీనామా కోసం పట్టుబడుతుంటే వైసీపీ మాత్రం గోడ మీద పిల్లి తరహా పాత్ర పోషిస్తూ జరుగుతున్న పరిణామాలకు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతుంది. జగన్ అనుసరిస్తున్న ఈ మౌనం వెనుక వివేకా గొడ్డలి వేటు కేసుతో పాటుగా లిక్కర్ కేసు, తిరుమల లడ్డు కేసు, జగన్ అక్రమాస్తుల కేసు ఇలా అనేక కేసులు వైసీపీ నోటికి తాళం వేస్తున్నాయా.? వైసీపీ నాయకులకు కాళ్ళకు కంచెలుగా మారుతున్నాయా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

చిర్రి బాలరాజు…ఒక్క ఛాన్స్ తో సరిపెట్టుకుంటారా.?

పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారం జనసేన కు పెద్ద తలనొప్పిగా మారింది. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే…

14 seconds ago

J.D. Vance Pauses PERM: Lawyers Question Gov Data

J.D. Vance has targeted multiple companies in his largescale immigration crackdown. Microsoft, TCS, Cognizant, and…

56 minutes ago