
పార్టీ అధినేత పర్యటనలు, బలప్రదర్శనలు, రప్ప రప్ప నినాదాలు, జగన్ 2.0 స్లొగన్స్, ఐ పాక్ రాజకీయాలతో ఎప్పుడు హడావుడిగా ఉండే వైసీపీ రాజకీయం ఈ మధ్య కాలంలో చాల సైలెన్స్ అయ్యాయనే చెప్పాలి. ఇందుకు కారణాలు ఏమిటో ఆ తాడేపల్లి జగనాథుడికే ఎరుక.
ఒక పక్క కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో ఇచ్చిన సూపర్ సిక్స్ సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులకు అందుబాటులోకి తెచ్చింది.
మహిళలకు ఉచిత బస్సు నుంచి ఆటోడ్రైవర్ లకు అందించే నగదు సాయం వరకు, అలాగే మెగా డిఎస్సి నుంచి తల్లికి వదనం వరకు ఇలా ఎన్నికల హామీలు ప్రతిదీ రాష్ట్రంలో అమలులోకి వచ్చాయి.
అలాగే మరోపక్క ఏపీ వ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతికి పునాదులు పడుతున్నాయి. ఐటీ హబ్ గా విశాఖ, ఎడ్యుకేషన్ల్ హబ్ గా అమరావతి, శ్రీ సిటీ తో చిత్తూరు, గ్రీన్ ఎనర్జీ సిటీగా కర్నూల్ ఇలా అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు కొలువు తీరుతున్నాయి.
అలాగే 2027 లక్ష్యంగా అమరావతి పనులు పరుగులు పెడుతున్నాయి, పోలవరం పూర్తి కోసం కేంద్రం నుండి నిధులు సేకరిస్తున్నారు. ఇక తాజాగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఉపఎన్నికలలో సైతం ప్రజలు కూటమికే పట్టం కట్టడంతో వైసీపీ రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చిందా.? అన్న చర్చ నడుస్తుంది.
పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీ ముఖం చూడను అంటూ మొండికేసిన వైసీపీ అధినేత వైస్ జగన్ చర్యలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనేది వైసీపీ గ్రహించిందా.? పార్ట్ టైం పొలిటీషియన్ మాదిరి జగన్ ఏపీలో వీక్ ఎండ్ రాజకీయాలు నడుపుతున్నారు అనే ధోరణిలోకి పార్టీ క్యాడర్ సైతం వచ్చేసిందా.?
లిక్కర్ స్కాం మొదలు గత ఐదేళ్ల వైసీపీ అవినీతి ఒక్కొక్కటిగా బయటకొస్తూ వైసీపీ ని రాజకీయంగా దెబ్బకొడుతున్నాయా.? జగన్ ఐ పాక్ రాజకీయాలు, సోషల్ మీడియా అసత్య ప్రచారాలు కూడా వైసీపీ ని కోలుకోనివ్వడం లేదా.? ఇలా అనేక సమాధానం లేని ప్రశ్నలే వైసీపీ ని బయటకు రానివ్వడంలేదా.?
In a massive celebration of Telugu pride, Telangana Chief Minister A. Revanth Reddy formally unveiled…
Indian professionals in the United States are facing growing uncertainty due to new USCIS policies…