
వైస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన స్థాయికి కానీ, ఆయన పదవికి కానీ ఎటువంటి విలువ ఇవ్వకుండా తన ఎన్నికల ప్రచారంలో నిత్యం మహిళలను టార్గెట్ చేస్తూ ప్రసంగాలు చేయడం నిజంగా హీనమైన చర్యగా భావించాలి అంటూ సోషల్ మీడియాలో జగన్ ప్రసంగాల పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
బటన్ నొక్కుడు కార్యక్రమాలు మొదలుకొని, ఎన్నికల ప్రచారం వరకు అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ మీడియా కంటికి కనిపించారు అంటేనే మహిళలను అవమానించేలా, వారి మనోభావాలను దెబ్బ తీసేలా ఏదోఒక వ్యాఖ్య చేయనిదే తిరిగి తాడేపల్లి ప్యాలస్ కు వెళ్లే పరిస్థితి ఉండదనేది ప్రతిపక్షల వాదన. ఇప్పుడు ఇదే వాదనను బలపరిచేపనిలో జగన్ బలంగా పనిచేస్తున్నారు.
మైకు కనపడగానే పవన్ ను విమర్శించడానికి ఆయన వ్యక్తిగత జీవితాన్ని బహిరంగ వేదికల మీద తీసుకురావడం, దానితో పెళ్ళాలు అంటూ అసభ్యకరంగా మాట్లాడడం, విడాకులు తీసుకుని వేరే జీవితం గడుపున్న మహిళల జీవితాలను తన రాజకీయ స్వార్దానికి బజారుకి లాగి వాడుకోవడం ఇన్నాళ్లుగా చూస్తున్న ప్రజానీకానికి ఇప్పుడు జగన్ మరో మెట్టు దిగజారారని పులివెందుల సభ సాక్షిగా నిరూపించుకున్నారు.
కాంగ్రెస్ కడప ఎంపీ గా అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్దమైన తన సొంత చెల్లి షర్మిల మీద కనీస సంస్కారంలేని వ్యాఖ్యలు చేసారంటూ టీడీపీ అధినేత బాబు, లోకేష్ కూడా తన సోషల్ మీడియాలో స్పందించారు. వైస్సార్ పై కుట్రలు పన్నిన వారితో చేతులు కలిపి పసుపు చీర కట్టుకుని వారి ఇళ్లకు వెళ్లి, వారికీ మోకరిల్లి వారి కుట్రలో భాగమైన వారు వైస్సార్ వారసులవుతారా..? అంటూ తనముందున్న స్క్రిప్ట్ పేపర్ చదివేసారు ముఖ్యమంత్రి.
ఇలా ఆడవారి కట్టు బొట్టులా పైన కూడా ముఖ్యమంత్రి విమర్శలు చేయడం అది స్వయాన సొంత చెల్లిని ఉద్దేశించి బహిరంగ సభలో ఇటువంటి విమర్శలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగునా..? అంటూ సోషల్ మీడియాలో వైసీపీ పైన జగన్ పైన నెగటివ్ ప్రచారం జరుగుతుంది. ఇన్నాళ్లు మహిళలను కార్లతో పోల్చిన జగన్ ఇప్పుడు చీర రంగుల పై ద్రుష్టి సారించారు.
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా , ఒక పార్టీ అధినేత గా ఉంటూ స్వయంగా ఆయనే చీరల గురించి, చీరల రంగు గురించి ప్రస్తావించడం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదని ఇకనైనా పెళ్ళాలు, చీరల గురించి ప్రస్తావించకుండా తన పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలంటూ హితవుపలుకుతున్నారు ప్రజాసంఘాలు.
మహిళల పట్ల ఇటువంటి ఆలోచనాధోరణి ఉంటే రాజకీయాల మీద ఆసక్తి ఉన్న మహిళలు వెనుకడుగు వేసే ప్రమాదం లేకపోలేదు. హత్య ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులకు అండగా నిలబడానికి సొంత చెల్లెల్లు చీరల పై కూడా విమర్శలు చేసే స్థాయికి జగన్ దిగజారిపోతున్నారా..? హత్య ఆరోపణలు ఎదుర్కుంటున్న వారిని చిన్న పిల్లాడు అంటూ సంబోధించడం, కుమారుడికి పెళ్లి చేసి అత్తగారి స్థాయికి వచ్చిన చెల్లెలు చీరల పై నీచమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఏమనాలి..?
టీడీపీ పార్టీకి పసుపు రంగు ఉంటే ఇక ఆ పసుపు రంగు దుస్తులు ఎవ్వరు వెయ్యకూడదా..? అలా వేస్తే ఇక ఆ వ్యక్తులు టీడీపీ పార్టీకి చెందిన వారీగా భావించాలా..? ఈ ఎన్నికలలో వైసీపీ కి మరో ఛాన్స్ ఇస్తే ఇక రాష్ట్రంలో పసుపు రంగును బాన్ చేస్తారా..? అసలు పసుపు రంగు చూస్తే జగన్ ఎందుకు ఇంతలా భయపడుతున్నారు..? అంటూ సామజిక మాధ్యమాలలో జగన్ కు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…