అది’ బాహుబలి’ గ్రాఫిక్స్ అయితే…ఇది ‘యాత్ర’ గ్రాఫిక్సా..?

YS Jagan

ఎన్నికలకు రెండు నెలల ముందు ‘విజన్ విశాఖ’ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన చిత్రాల పై సోషల్ మీడియా లో మీమ్స్ మొదలయ్యాయి. మన ప్రభుత్వానికి కూల్చడమే కానీ నిర్మించడం కూడా వచ్చా అన్నా..? అంటూ ఒకరు, అమరావతి నిర్మాణాలను వైసీపీ నేతలు బాహుబలి గ్రాఫిక్స్ తో పోల్చారు కదా…ఇప్పుడు విశాఖలో మీరు చూపించేవి యాత్ర గ్రాఫిక్సా..? అంటూ మరికొందరు ఆడేసుకుంటున్నాడు.

ఈ ఐదేళ్ల పాలనలో వైసీపీ కూల్చిన కట్టడాల లిస్ట్ చాంతాడంత ఉంటే.., నిర్మించిన కట్టడాల లిస్ట్ చీమ తలకాయంత ఉంది. అలాగే వైసీపీ పాలన చివరిదశలో విశాఖ ఆర్కే బీచ్ లో కట్టక కట్టక కట్టిన ఫ్లోటింగ్ బ్రిడ్జి కొట్టుకుపోవడంతో…కట్టడాలు వైసీపీ కి అచ్చురావని తేలిపోయింది.

ADVERTISEMENT

అసలు రాజధాని కట్టుకోలేని హీన స్థితిలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఉందని, మరికొంతకాలం హైద్రాబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని మీడియా ముందు ప్రకటనలు చేసిన వైసీపీ పెద్దలు మరి జగన్ చెపుతున్న విజన్ విశాఖ సాధ్యమా అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా. ఎన్నికల ముందు జగన్ ఇచ్చే హామీలన్నీ ఏవిధంగా ఉంటాయో ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చిన ప్రజలు జగన్ చెప్పే కళ్ళబుల్లి కబుర్లు నమ్మే పరిస్థితిలో లేరనేది వైసీపీ గ్రహించాలి.

గత టీడీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాల గురించి తన విజనరినీ ఆవిష్కరిస్తే.., అవి బాహుబలి గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవా చేసిన ఈ పెద్ద మనిషి అమరావతి పై విషం కక్కి, అమరావతి నుండి విశాఖ అంటూ కాలం గడిపేశారు. ఇప్పుడు అదే తరహా గ్రాఫిక్స్ బొమ్మలను చూపిస్తూ విశాఖను ఇలా మార్చేస్తా..అలా చేసేస్తా..అంటూ చెప్పే మాటలను ప్రజలు నమ్ముతారా..? అయినా కట్టిన సచివాలయాలనే తాకట్టు పెడుతున్న ఈ ముఖ్యమంత్రి కొత్త నిర్మాణాలను చేపట్టగలరా..?

గడిచిన నాలుగున్నరేళ్లుగా కొత్త నిర్మాణాల మాటఅటుంచితే ఉన్న నిర్మాణాల మరమత్తులు కానీ, కనీసం గుంతలు పడ్డ రోడ్లకు రిపేర్లు కానీ చేయించలేని ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చూపిస్తున్న ఈ యాత్ర గ్రాఫిక్స్..యాత్ర సినిమా కలెక్షన్ల మాదిరే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్ళలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేని వైసీపీ, అలాగే అమరావతి వదిలి ఒక్కఅడుగు కూడా వేయలేని ఈ వైసీపీ ఇప్పుడు మాత్రం అద్భుతాలు చేసేస్తాం, హిరణ్యవర్ణాలు సృష్టిచేస్తాం, ఆకాశ సోదాలు నిర్మిస్తాం అంటే నమ్మడానికి ఏపీ ప్రజలంతా వైసీపీ కార్యకర్తలేమి కాదు కదా..?

ADVERTISEMENT
Latest Stories