Telugu

విశాఖ లేదు… అమరావతీ లేదు… అందరి నెత్తిన గుడ్డే మిగిలింది

సిఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 13న వైఎస్సార్ వాహనమిత్ర లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసేందుకు విశాఖకు వస్తున్నారు. చెక్కుల పంపిణీ సభలో ముందుగా లబ్దిదారుల జగనన్న భజన కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత సిఎం జగన్‌ తన ప్రభుత్వం నభూతో న భవిష్యత్ అన్నట్లు ఏవిదంగా ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తోందో చెప్పుకొంటారు. పనిలో పనిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, మీడియానును తిట్టిపోయకమానరు. ఈ కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ తాడేపల్లి వెళ్ళిపోతారు.

అయితే జగన్ ప్రభుత్వం విశాఖకు ఏమి చేసిందో ఓసారి చూద్దాం. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తామని మూడేళ్ళ క్రితం ప్రకటించడంతో, విశాఖనగరంలో అనేకమంది పెట్టుబడులు పెట్టి భారీగా నిర్మాణాలు చేపట్టారు. ఆ నిర్ణయంతో అమరావతి చుట్టుపక్కల భారీగా పెట్టుబడులు పెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ తీవ్రంగా నష్టపోయారు.

ADVERTISEMENT

కానీ హైకోర్టు ఆదేశానుసారం అమరావతిలో నిర్మాణ పనులు మొదలుపెట్టడంతో విశాఖలో భూములు, అపార్టుమెంటుల ధరలు పడిపోవడంతో మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. పోనీ.. ఎట్టకేలకు సిఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధానిగా అంగీకరించి పనులు మొదలుపెట్టారు కనుక మళ్ళీ తాము తేరుకోవచ్చని ఆశపడుతున్న అక్కడ పెట్టుబడులు పెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆశపడుతుంటే, ప్లీనరీలో మళ్ళీ మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడంతో వారు హతాశులయ్యారు.

అలాగని విశాఖలో రియల్ ఎస్టేట్ ఏమైనా పుంజుకోవడం లేదు. ఎందుకంటే, ఓసారి అమరావతి మరోసారి మూడు రాజధానులని చెపుతున్న జగన్‌ ప్రభుత్వం మాటలను ఇప్పుడు ఎవరూ నమ్మడం లేదు.

ఒకవేళ జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నా మరో రెండేళ్ళలో పదవీకాలం పూర్తయిపోతుంది. మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలీదు. ఒకవేళ వచ్చినా హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తాయో లేవో తెలీదు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోతే రాష్ట్రంలో మళ్ళీ టిడిపి లేదా దాని కూటమి అధికారంలోకి వస్తుంది. అప్పుడు టిడిపి ప్రభుత్వం మళ్ళీ అమరావతినే రాజధానిగా ఖరారు చేయడం ఖాయం.

అంటే ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలయ్యి కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు రాజధాని ఎక్కడ ఉంటుందో సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలేని పరిస్థితి నెలకొని ఉందన్న మాట!

ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాస్త అభివృద్ధి చెందిన నగరాలలో విశాఖపట్నం ఒకటి. జగన్ ప్రభుత్వం అక్కడ కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయకపోయినా ఈ మూడేళ్ళలో కొత్తగా ఒక్క ఫ్లై ఓవర్ నిర్మించలేకపోయింది. నగరానికి ఒక్క పెద్ద ఐటి కంపెనీని రప్పించలేకపోయింది. కొత్తగా ఒక్క భారీ పరిశ్రమను తేలేకపోగా కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా కాపాడలేకపోయింది. చివరికి విశాఖలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పచ్చటి రుషికొండను మొత్తం తవ్వేసి మట్టిదిబ్బగా మార్చేసింది.

ఈవిదంగా జగన్‌ ప్రభుత్వం ఇటు విశాఖ నగరానికి, రియల్ ఎస్టేట్ రంగానికి, ప్రజలకు, అదేవిదంగా అటు అమరావతికి, రియల్ ఎస్టేట్ రంగానికి, ప్రజలకు, ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు తీరని మనోవేదన మిగిల్చింది. అయినా మాది ప్రజారంజకమైన ప్రభుత్వమని గొప్పగా చెప్పుకోవడం చాలా గొప్ప విషయమే కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas’ Re-Release $13.5: Why US Tickets So Expensive?

Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…

2 hours ago

Karthik Subbaraj’s Dorothy: Will Netflix Release Spark Fresh Controversy?

Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…

3 hours ago